హత్య ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

vijay antony hatya movie ott release date fixed

తమిళ్ హీరోల్లో విభిన్నమైన పాత్రలు చేసే హీరోల్లో చాలా మంది ఉన్నారు. వారిలో విజయ్ ఆంటోని పేరు కూడా ఉంటుంది. మొదటినుండీ కాస్త డిఫరెంట్ సినిమాలు చేయడానికే విజయ్ ఆంటోని ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. అందుకే విజయ్ ఆంటోని నుండి సినిమా వస్తుందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బిచ్చగాడు తరువాత తెలుగులో కూడా విజయ్ ఆంటోనికి మంచి ఫాలోయింగ్ పెరిగింది. రీసెంట్ గానే విజయ్ ఆంటోని హత్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈసినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకోగా తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈనెల 20వ తేదీన ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. తెలుగు, తమిళ్ లో ఈసినిమాను అందుబాటులోకి తీసుకున్నారు.

కాగా ఈసినిమాలో రితికా సింగ్ హీరోయిన్ గా నటించగా.. ఇంకా ఇతర కీలక పాత్రల్లో జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు కనిపించారు. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థపై కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ ఈసినిమాను నిర్మించగా.. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ.. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 20 =