పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన బ్రో సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. తమిళ్ లో వచ్చి సూపర్ హిట్ అయిన వినోదయ సితం అనే సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. పవన్ కళ్యాణ్ నటన, పవన్-తేజ్ ల కాంబినేషన్, మ్యూజిక్, డైలాగ్స్ అన్నీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకోవడంతో మంది ఆదరణతో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ విజయోత్సవ యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈమేరకు సాయి ధరమ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులు ఒక రిక్వెస్ట్ చేశారు. అందరికీ నమస్కారం.. బ్రో విజయయాత్రలో భాగంగా మీరు నాపై చూపించిన అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్.. అందరినీ కలుసుకోవడం.. మీ ప్రేమను పొందడం.. సినిమా గురించి మీ నుండి వినడం చాలా బాగుంది. అయితే నన్ను కలవడానికి వచ్చేవారు ఫొటోలు, సెల్ఫీలు అంటూ ఆప్యాయంగా దగ్గరికి వస్తున్నారు. వీలైనంత మేరకూ నేను అందరికీ అందుబాటులో ఉండటానకే ప్రయత్నిస్తున్నాను.
అయితే ఈక్రమంలో చాలామంది హెల్మెట్ ధరించకుండా బైకుల మీద ఫాలో చేయడం.. డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు.. ఈ విషయం నాకు ఎంతో భయాన్ని కలిగిస్తోంది. మీ అభిమానంతో ఇలా చేస్తున్నప్పటికీ ఆ క్రమంలో మీకు ఎటువంటి హాని కలిగినా నాకు తీవ్ర మనస్థాపన కలిగిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని అభిమానుల్లా కన్నా బ్రోస్ లా భావిస్తాను.. మీ భద్రత… నా బాధ్యత. దయచేసి మీరు బైక్ మీద వెళ్లేప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి.. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మరిచిపోకండి.. నాకు మీ ప్రేమని పొందుతూ ఉండే అవకాశం ఇవ్వండి. అర్ధం చేసుకోగలరు అని భావిస్తున్నాను అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
Grateful for your love & kindness. Thank you! 🙏🏼#BroTheAvatar #BroVijayaYatra pic.twitter.com/ntpjS3Pg27
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 4, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: