రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నసైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఏడి.ఇటీవల విడుదలైన ఈసినిమా గ్లింప్స్ కు విశేషమైన స్పందన వచ్చింది.దాంతో సినిమాఫై అంచనాలను తార స్థాయికి చేరుకున్నాయి.ప్రస్తుతం షూటింగ్ స్టేజి లో ఉంది ఈసినిమా.ఇక నిన్నహైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.ప్రభాస్ ,హీరోయిన్ దీపికా పదుకోణ్ తదితరుల ఫై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈనెల 28వరకు ఈ షెడ్యూల్ జరుగనుంది.భారీ విఎఫ్ఎక్స్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్నఈసినిమాకి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది.ఈసంస్థకు ఇది 50వ సినిమా కావడం విశేషం.వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్లలోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక వచ్చే నెలలో ప్రభాస్ సలార్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు.ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.సెప్టెంబర్ 28న సలార్ థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: