సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. వరుసగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలతో మూడు హిట్లను అందుకున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి ఓజీ సినిమాపై పడింది. సుజీత్ దర్శకత్వంలో పవన్ హీరోగా వస్తున్న సినిమా ఓజీ.. (ఒరిజినల్ గ్యాగ్ స్టర్). ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. పవన్ కూడా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. గ్లింప్స్ కు అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాతో పవన్ మరో హిట్ ను కొట్టనున్నాడన్న అభిప్రాయాలు వచ్చేశాయి. ఇదిలాఉండగా ఈసినిమాలో అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి విదితమే కదా. ఈనేపథ్యంలో ఒక అభిమాని తమిళ్ లో మీ వాయిస్ నెక్స్ట్ లెవెల్ అంటూ ప్రశంసించాడు. అందుకు అర్జున్ దాస్ రిప్లై ఇస్తూ.. నెక్స్ట్ టైమ్ తెలుగు, హిందీ భాషల్లో బెటర్ గా ట్రై చేస్తా అంటూ చెప్పుకొచ్చారు.
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: