పి.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా చంద్రముఖి 2. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. ఈసినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా జ్యోతిక తన సోషల్ మీడియా వేదికగా కంగనపై ప్రశంసలు కురిపించింది. ఇండియన్ సినిమాలోనే టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరైన కంగనా చంద్రముఖి పాత్రలో నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.. చంద్రముఖి పాత్రలో మీరు చాలా అద్భుతంగా ఉన్నారు. మీ నటనకు నేను కూడా పెద్ద అభిమానిని.. అందులోనూ ఇలాంటి పాత్రలో నటించిన మిమ్మల్ని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. లారెన్స్, పి.వాసుకి ఆల్ ది బెస్ట్.. మరో సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ ల పేర్కొన్నాడు.
ఇక ఈసినిమాలో లెజెండరీ కమెడియన్ వడివేలు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలలో కనిపిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్నారు. ఆర్.జీ రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభస్కరన్ నిర్మిస్తున్నారు. మరి చంద్రముఖి ఎన్నో సంచలనాలు సృష్టించింది.. ఈ సీక్వెల్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: