
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 44


కార్తీ జపాన్ టీజర్ రిలీజ్



భగవంత్ కేసరి ఫన్నీ వీడియో రిలీజ్

ఛత్రపతి రీ రిలీజ్ డేట్ ఫిక్స్

తరుణ్ భాస్కర్ కీడా కోలా ట్రైలర్ రిలీజ్

వచ్చే ఏడాదికి మారిన కంగన ఎమర్జెన్సీ రిలీజ్

ధనుష్ లో నన్ను నేను చూసుకున్నాను

లియో.. 100కోట్ల ప్రీ సేల్స్

లియో తెలుగు వెర్షన్ రిలీజ్ పై నాగవంశీ క్లారిటీ

భగవంత్ కేసరి రన్ టైం రివీల్

భగవంత్ కేసరి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్

1 మిలియన్ ప్రీ సేల్స్ తో లియో రాంపేజ్

సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ ట్రైలర్ రిలీజ్
హీరోగా చేయాలంటే మంచి ఫిజిక్, హైట్, అందం ఇలాంటి లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగే సత్తా ఉంటే చాలని ఇప్పటికే చాలామంది నిరూపించారు. అలాంటి వారిలో సంపూర్ణేష్ బాబు కూడా ఒకరు. హృదయ కాలేయం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు. మొదటిసినిమాతోనే ప్రేక్షకుల నుండి కావాల్సినంత అటెన్షన్ ను రాబట్టుకోగలిగాడు. ఇక ఆతరువాత సింగం 123, కొబ్బరిమట్ట, బజార్ రౌడీ, పెసరట్టు అంటూ డిఫరెంట్ టైటిల్స్ తో తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

కార్తీ జపాన్ టీజర్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ.. విజయాలు అందుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతో హిట్ ను అందుకున్న కార్తీ ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ ను చూస్తేనే అర్థమవుతుంది ఈసినిమాలో కార్తి డిఫరెంట్ మేకోవర్ తో వస్తున్నాడని. అంతేకాదు ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

సిద్దు జొన్నలగడ్డ 'తెలుసు కదా' షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన నాని, స్క్రిప్ట్ అందించిన నితిన్
'గుంటూరు టాకీస్' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సిద్దు జొన్నలగొడ్డ.. ఆపై తనదైన శైలిలో ఒక్కో సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలో 'డీజే టిల్లు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అతడికి యూత్‌లో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. దీంతో తన తదుపరి సినిమాను తెరకెక్కించడానికి బాగా టైమ్ తీసుకున్నాడు సిద్దు. ఈ నేపథ్యంలోనే 'డీజే టిల్లు'కి సీక్వెల్ గా 'డీజే టిల్లు స్క్వేర్'లో నటిస్తున్నాడు. అలాగే దీనితోపాటుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. అయితే ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సిద్దు జొన్నలగొడ్డ మరో కొత్త సినిమాను ప్రారంభించాడు.

నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత.. ఫస్ట్ పోస్ట్ షేర్ చేసిన అల్లు అర్జున్, నెట్టింట వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు టాలీవుడ్ హీరో మాత్రమే కాదు, జాతీయ ఉత్తమ నటుడు కూడా. అవును, కేంద్రప్రభుత్వం ప్రకటించిన 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని తన అత్యుత్తమ నటనకుగానూ ఆయన ఈ పురస్కారాన్ని పొందారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ అల్లు అర్జున్‌కి అభినందనలు తెలిపింది.

భగవంత్ కేసరి ఫన్నీ వీడియో రిలీజ్
అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తరువాత నటసింహం బాలకృష్ణ నుండి వస్తున్న సినిమా భగవంత్ కేసరి. రెండు బ్లాక్ బస్టర్ల తరువాత వస్తుండటం.. అందులోనూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఇంకా ఒక్క రోజులో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వరుస అప్ డేట్లతో సినిమాపై కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేశారు. అంతేకాదు టైటిల్ సాంగ్ తో ఆ అంచనాలను మరింత పెంచేశారు. ఇదిలా ఉండగా.. ఈసినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఫన్ ఆన్ సెట్ అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోలోషూటింగ్…

ఛత్రపతి రీ రిలీజ్ డేట్ ఫిక్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో త్వరలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు తన నుండి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కల్కి 2898 ఏడీ . ఈసినిమాను ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. దానికి తగ్గట్టే ఈసినిమా షూటింగ్ దశలో ఉండగానే అంతర్జాతీయ లెవల్ లో గుర్తింపును తెచ్చుకుంటుంది. దీనితోపాటు సందీప్ వంగాతో ఒక సినిమా అలానే మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు.

లియోపై ఉదయనిధి స్టాలిన్ రివ్యూ.. విజయ్, లోకేష్ కనగరాజ్‌లపై ప్రశంసలు
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న చిత్రం 'లియో'. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. బాలీవుడ్ ప్రముఖ నటులు సంజయ్ దత్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో 'లియో' మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా.. జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 19న దసరా పండుగ సందర్భంగా 'లియో' సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

గణపథ్ విడుదలకు ముందు.. కొత్త ప్రోమో రిలీజ్ చేసిన మూవీ టీమ్
బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడిగా తెరంగేట్రం చేసిన టైగర్ ష్రాఫ్.. కొద్దిరోజుల్లోనే స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు. కేవలం వారసత్వాన్నే నమ్ముకోకుండా డ్యాన్స్, ఫైట్స్, నటనలో తన టాలెంట్ చూపించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా టైగర్ ష్రాఫ్ సినిమాలలో యాక్షన్ హై వోల్టేజ్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం 'గణపథ్'. 'ఏ హీరో ఇస్ బార్న్' అనేది ఉపశీర్షిక. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

తరుణ్ భాస్కర్ కీడా కోలా ట్రైలర్ రిలీజ్
పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డును సైతం దక్కించుకున్నాడు తరుణ్ భాస్కర్. ఆతరువాత ఈ నగరానికి ఏమైంది సినిమా తీశాడు. ఆ సినిమా కూడా మంచి హిట్ ను అందుకుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ నుండి మరో సినిమా కోసం వెయిట్ చేస్తుండగా తానే హీరో అవతారం ఎత్తి ఒక సినిమా తీశాడు. ఆ తరువాత రెండు మూడు సినిమాల్లో పలు క్యారెక్టర్లలో కూడా నటించాడు.

వచ్చే ఏడాదికి మారిన కంగన ఎమర్జెన్సీ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన సినిమాలతో, పాత్రలతో బాలీవుడ్ క్వీన్ అనిపించుకుంది. ఇక ఇప్పుడు హిందీలో మాత్రమే కాకుండా వేరే భాషల్లో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా చంద్రముఖి2తో వచ్చింది. ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే తను తన కొత్త పాజెక్ట్ తో బిజీ అయిపోయింది.

ధనుష్ లో నన్ను నేను చూసుకున్నాను
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. 1930 - 40ల బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ మూవీగా పుల్ యాక్షన్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా డిసెంబర్15వ తేదీన తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

భగవంత్ కేసరి టైటిల్ సాంగ్ రిలీజ్
బాలకృష్ణ -అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న భగవంత్ కేసరి మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ గా వుంది.ఇక ఈసినిమా నుండి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న టైటిల్ సాంగ్ కొద్దిసేపటిక్రితం విడుదలయింది.రోర్ ఆఫ్ కేసరి పేరుతో విడుదలైన ఈ సాంగ్ కు తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు.థియేటర్లను ఈ సాంగ్ షేక్ చేయడం ఖాయం.బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.యంగ్ హీరోయిన్ శ్రీ లీల,బాలకృష్ణ కూతురుగా కనిపించనుంది. భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్స్ ఈ సినిమాను నిర్మించింది.

లియో.. 100కోట్ల ప్రీ సేల్స్
లియో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది.కేవలం ప్రీ సేల్స్ తోనే 125కోట్లకు పైగా రాబట్టింది.రెండు రోజుల్లో బుక్ మై షో లో ఈసినిమాకు 1మిలియన్ టికెట్స్ బుక్ అయ్యాయి.ఇక ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే కలెక్షన్స్ 6మిల్లియన్ డాలర్ల కు చేరుకుంది.దాదాపు అంతటా లియో మ్యానియా కొనసాగుతుంది.తెలుగులో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో లియో అదరగొడుతుంది.తమిళ వెర్షన్ కు దీటుగా తెలుగు వెర్షన్ కు టికెట్స్ తెగుతున్నాయి. మొదటి రోజు లియో తెలుగులో కొత్త రికార్డు సృష్టించనుంది.

లియో తెలుగు వెర్షన్ రిలీజ్ పై నాగవంశీ క్లారిటీ
తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దసరా పండుగ సందర్భంగా ఈసినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రబృందం.

భగవంత్ కేసరి చేయడానికి కారణం అదే - కాజల్ అగర్వాల్
‘భగవంత్’ కేసరి లాంటి గొప్ప సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుందని, ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని పేర్కొన్నారు ప్రముఖ నటి కాజల్ అగర్వాల్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే శ్రీలీల మరో కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా కనిపించనున్నారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల కానున్న నేపథ్యంలో.. ఇప్పటికే విడుదలైన ఈ…

వాట్ ద ఫిష్- వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ రిలీజ్
మంచు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో మనోజ్. అయితే మనోజ్ కు మాత్రం ఇప్పటివరకూ బ్లాక్ బస్టర్ హిట్ అనేది దక్కింది లేదు. కెరీర్ మొదట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈమధ్య సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత కొత్త సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో మనోజ్ హీరోగా వస్తున్న సినిమా వాట్ ద ఫిష్. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది.

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం (అక్టోబర్ 17, 2023) అందజేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. దీనిలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాస్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో తన అత్యుత్తమ నటనకుగానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. అలాగే 'పుష్ప' సినిమాకు అందించిన అద్భుతమైన సంగీతానికిగానూ…

భగవంత్ కేసరి రన్ టైం రివీల్
మచ్ అవైటెడ్ మూవీ భగవంత్ కేసరి మరో రెండు రోజుల్లో థియేటర్లర్లోకి రానుంది.ట్రైలర్ తో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.బాలకృష్ణ ను ఈసినిమాలో సరికొత్త గా చూపించనున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.ఇక ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు ఈసినిమాకు యు/ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.ఈసినిమాకు రన్ టైం కూడా కొంచెం ఎక్కువగానే వుంది.164 నిమిషాల రన్ టైంతో ఈసినిమా రానుంది.

భగవంత్ కేసరి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. దసరా పండుగ సందర్భంగా ఈసినిమా ఆక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

1 మిలియన్ ప్రీ సేల్స్ తో లియో రాంపేజ్
రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా లియో. ఈసినిమా రిలీజ్ కు ముందే సూపర్ బజ్ ను క్రియేట్ చేసుకుంది. తెలుగులో ఈసినిమా ప్రమోషన్స్ సరిగ్గా లేకపోయినా విజయ్ కు ఉన్న క్రేజ్ వల్ల సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అందరి ఎదురుచూపులకు మరో రెండు రోజుల్లో బ్రేక్ పడనుంది.