లియో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది.కేవలం ప్రీ సేల్స్ తోనే 125కోట్లకు పైగా రాబట్టింది.రెండు రోజుల్లో బుక్ మై షో లో ఈసినిమాకు 1మిలియన్ టికెట్స్ బుక్ అయ్యాయి.ఇక ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే కలెక్షన్స్ 6మిల్లియన్ డాలర్ల కు చేరుకుంది.దాదాపు అంతటా లియో మ్యానియా కొనసాగుతుంది.తెలుగులో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో లియో అదరగొడుతుంది.తమిళ వెర్షన్ కు దీటుగా తెలుగు వెర్షన్ కు టికెట్స్ తెగుతున్నాయి. మొదటి రోజు లియో తెలుగులో కొత్త రికార్డు సృష్టించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ నిర్మాత సితార ఎంటెర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఈసినిమాను తెలుగులో విడుదలచేస్తున్నాడు.ఈరోజు మీడియా తో మాట్లాడినా అయన..లియో ఈవెంట్ గురించి స్పందించారు.ఈ ఆదివారం లోపే ఈవెంట్ ఉంటుందని అయితే దీనికి విజయ్ వస్తారో లేదో తెలియదు కానీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్,మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అలాగే హీరోయిన్ త్రిష అటెండ్ అవుతారని క్లారిటీ ఇచ్చాడు.భారీ అంచనాల మధ్య లియో మరి కొన్ని గంటల్లో థియేటర్లోకి రానుంది. ఈసినిమాకు రన్ టైం కూడా కాస్త ఎక్కువగానే వుంది.దాదాపు 164నిమిషాల నిడివి తో రానుంది.
ఓవరాల్ గా లియో కోలీవుడ్ లో సంచనాలు సృష్టించనుంది.సంజయ్ దత్ ,అర్జున్ సర్జా ,గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈసినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: