భగవంత్ కేసరి చేయడానికి కారణం అదే – కాజల్ అగర్వాల్

Kajal Aggarwal Reveals Interesting Facts About Nandamuri Balakrishna's Bhagavanth Kesari

‘భగవంత్’ కేసరి లాంటి గొప్ప సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుందని, ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని పేర్కొన్నారు ప్రముఖ నటి కాజల్ అగర్వాల్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే శ్రీలీల మరో కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా కనిపించనున్నారు. కాగా ‘భగవంత్ కేసరి’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల కానున్న నేపథ్యంలో.. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ఈ సందర్భంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ విలేకరుల సమావేశంలో ‘భగవంత్ కేసరి’ విశేషాలని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘భగవంత్ కేసరి’ గురించి విశేషాలు కాజల్ అగర్వాల్ మాటల్లోనే..

  • ఈ సినిమాలో నేను కాత్యాయని అనే ఒక సైకాలజిస్ట్ పాత్రను పోషించాను. చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ క్యారక్టర్.
  • నా పాత్ర చాలా సరదాగా వుంటుంది, అలాగే నా పాత్రలో చాలా హ్యుమర్ వుంటుంది. ఈ పాత్ర చేస్తున్నపుడు చాలా ఎంజాయ్ చేశాను.
  • ‘భగవంత్ కేసరి’ స్త్రీశక్తి, మహిళా సాధికారతని చాటే కథ. ‘భగవంత్ కేసరి’ కాన్సప్ట్ నాకు చాలా నచ్చింది.
  • ఆడపిల్లని ధైర్యంగా పెంచడం, అలాగే మహిళా సాధికారత గురించి మాట్లాడే అవసరం ప్రస్తుత సమాజంలో వుంది.
  • మన సూపర్ స్టార్స్ ఇలాంటి కథలు చెప్పడాని ముందుకు రావడం చాలా ఆనందాన్ని ఇస్తుంది.
  • నా పాత్ర ఎలా వుందో అని కాకుండా ఈ కథ చెప్పాల్సిన అవసరం వుందని చేసిన సినిమా ఇది.
  • ఇలాంటి మంచి సందేశం ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ కథని ఎంచుకోవడానికి కారణం ఇదే.
  • అలాంటి ఓ గొప్ప సినిమాలో భాగం కావడం ఆనందం వుంది.
  • బాలకృష్ణ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే.. ఆయన చాలా స్వీట్ అండ్ ఫ్రెండ్లీ.
  • బాలకృష్ణకు గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ వుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చాలా నిజాయితీ గల మనిషి.
  • మా మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ వున్నాయి. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.
  • డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి సినిమాలని చాలా ఇష్టపడతాను. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలని చాలా ఎంజాయ్ చేశాను.
  • ఆయన టైమింగ్, సెన్స్ ఆఫ్ డైరెక్షన్ చాలా బావుంటాయి. ‘భగవంత్ కేసరి’లో ఆయన స్టైల్ వినోదం ఉంటూనే ఒక బలమైన సందేశం కూడా వుంటుంది.
  • శ్రీలీల చాలా టాలెంటెడ్. చాలా ఎనర్జిటిక్ గా వుంటుంది. సెట్స్ లో చాలా యాక్టివ్ గా వుంటుంది.
  • మంచి పాత్రలు చేయాలనే తపన తనలో వుంది. ఇందులో తను చేసిన విజ్జి పాప పాత్ర కథలో చాలా కీలకం.
  • ఖచ్చితంగా ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకొస్తుంది. తనకు చాలా మంచి భవిష్యత్ వుంటుంది.
  • తమన్ చాలా వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే పాటలు చాలా పెద్ద హిట్స్ అయ్యాయి.
  • నేపధ్య సంగీతం చాలా గ్రాండ్ గా వుంటుంది. థియేటర్స్ లో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.
  • షైన్ స్క్రీన్స్ నిర్మాతలు హరీష్, సాహూ గారు చాలా ప్యాషనేట్ ప్రోడ్యూసర్స్. ఎక్కడా రాజీపడకుండా సినిమాని చాలా గ్రాండ్ తీశారు.
  • ‘భగవంత్ కేసరి’ పవర్ ప్యాక్డ్ మూవీ. ఎమోషన్స్, యాక్షన్ చాలా అద్భుతంగా వుంటాయి.
  • బలమైన సందేశం కూడా వుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.
  • ప్రస్తుతం నేను కొత్తగా కమల్ హాసన్ గారితో ‘ఇండియన్ 2’ మరియు ‘సత్యభామ’ అనే సినిమాలు చేస్తున్నాను.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =