నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత.. ఫస్ట్ పోస్ట్ షేర్ చేసిన అల్లు అర్జున్, నెట్టింట వైరల్

Allu Arjun Shares First Post After Received National Award

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు టాలీవుడ్ హీరో మాత్రమే కాదు, జాతీయ ఉత్తమ నటుడు కూడా. అవును, కేంద్రప్రభుత్వం ప్రకటించిన 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలోని తన అత్యుత్తమ నటనకుగానూ ఆయన ఈ పురస్కారాన్ని పొందారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ అల్లు అర్జున్‌కి అభినందనలు తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ అవార్డుల కార్యక్రమం అనంతరం అల్లు అర్జున్ తన సంతోషాన్ని, ఆ ఆనంద క్షణాలను తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అందులో తన సతీమణి స్నేహా రెడ్డి మరియు తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మల దంపతులు ఉన్నారు. దీనికి ‘నా చుట్టూ మరపురాని వ్యక్తులతో చిరస్మరణీయమైన రోజు’ అని పోస్ట్ పెట్టారు. కాగా ప్రస్తుతం బన్నీ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఇదిలా ఉండగా.. ‘పుష్ప’ సినిమాకు అందించిన అద్భుతమైన సంగీతానికిగానూ దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

కాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ సినిమా డిసెంబర్ 17, 2021న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ చూపించిన భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. సినిమా మొత్తం వన్‌మ్యాన్‌ షోగా రక్తి కట్టించారు అల్లు అర్జున్‌. అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. దీంతో ‘పుష్ప’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో తిరుగులేని ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ‘పుష్ప’ చిత్రం 365 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అల్లు అర్జున్ సరసన కథానాయికగా నటించగా, ఫహద్ ఫాసిల్ ప్రతినాయకుడిగా పరిచయం అయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రం రెండవ భాగం షూటింగ్ జరుపుకుంటోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − two =