లియో తెలుగు వెర్షన్ రిలీజ్ పై నాగవంశీ క్లారిటీ

producer naga vamsi clarity on leo telugu version release

తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దసరా పండుగ సందర్భంగా ఈసినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రబృందం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో తెలుగు ఫ్యాన్స్ కు ఒక షాక్ తగిలింది. అయితే ఈవార్తలపై స్పందించిన నాగవంశీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చాడు. ఈసినిమా టైటిల్ విషయంలో మిస్ కమ్యునికేషన్ అయింది.. ఎవరో తెలుగులో లియో టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్నారు.. ఇక ఈ ఇష్యూను మేము సాల్వ్ చేశాము.. మమ్మల్ని అప్రోచ్ అవ్వకుండానే డైరెక్ట్ గా కోర్టుకు వెళ్లారు.. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ వల్ల నాకు కూడా ఈరోజే ఆ విషయం తెలిసింది.. అయితే రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు.. ముందుగా చెప్పినట్టే అక్టోబర్ 19వ తేదీనే తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అవుతుంది అని తెలిపారు.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ గా.. అన్బరివ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.