జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్

69th National Film Awards Allu Arjun Received Best Actor Award From President Droupadi Murmu

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం (అక్టోబర్ 17, 2023) అందజేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. దీనిలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాస్ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలో తన అత్యుత్తమ నటనకుగానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. అలాగే ‘పుష్ప’ సినిమాకు అందించిన అద్భుతమైన సంగీతానికిగానూ దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నేషనల్ అవార్డు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన సందర్భంగా.. బెస్ట్ నేషనల్ యాక్టర్‌ విజేతగా అల్లు అర్జున్ పేరు వెలువడిన వెంటనే టాలీవుడ్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న నేపథ్యంలో.. తెలుగు చిత్రసీమ నుంచి అల్లు అర్జున్ కు అభినందనలు వెల్లువెత్తాయి. సోషల్‌ మీడియా వేదికగా బన్నీకి పలువురు సినీ ప్రముఖులు, నెటిజెన్లు అభినందనలు తెలుపుతున్నారు. అయితే గత 69 ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని కలగా మిగిలిన ఈ అవార్డును అందుకోవడం ద్వారా అల్లు అర్జున్ తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో శాశ్వతంగా చెరగని ముద్ర లిఖించారు.

తొలితరం నటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులు కానీ.. ఆ తర్వాతి తరం అగ్ర హీరోలుగా వెలుగొందిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కానీ.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హేమాహేమీలెవ్వరికీ సాధ్యపడని రీతిలో అల్లు అర్జున్ ఈ అవార్డు గెలుచుకోవడం గమనార్హం. ఇప్పటివరకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు తెలుగువారెవరికీ దక్కలేదన్న బాధను తీర్చేశారు. దీంతో ఈ ఏడాది విశ్వవేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఆస్కార్‌ పురస్కారాన్ని గెలుచుకొని భారత కీర్తి పతాకను సగర్వంగా ఎగురవేసిన అద్భుతఘట్టం స్మృతిపథంలో కదలాడుతుండగానే తాజాగా తెలుగు సినిమా కీర్తికిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరినట్లయింది.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ సినిమా డిసెంబర్ 17, 2021న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ చూపించిన భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. సినిమా మొత్తం వన్‌మ్యాన్‌ షోగా రక్తి కట్టించారు అల్లు అర్జున్‌. మాస్‌ లుక్‌లో ఆయన మేకోవర్‌, నటనాపరంగా కనబరచిన వేరియేషన్స్‌, చిత్తూరు యాసలో ఆయన పలికిన సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి. మరీ ముఖ్యంగా ‘తగ్గేదేలే’ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ దేశవిదేశాల్లో మార్మోగిపోయింది. అంతర్జాతీయ క్రికెటర్లు సైతం మైదానంలో వికెట్ పడినప్పుడు, క్యాచ్ పట్టినప్పుడు, సిక్స్ కొట్టిన సందర్భాల్లో పుష్ప స్టైల్‌లో గడ్డం కింద చెయ్యి పెట్టి ‘తగ్గేదేలే’ అంటూ బన్నీని అనుకరించడం చూస్తే.. ఈ సినిమా ఎంత ప్రభావం చూపించిందో అర్ధమవుతుంది.

అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో ‘పుష్ప’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో తిరుగులేని ఆదరణ దక్కించుకుంది. మరో విశేషమేంటంటే..? హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమా అసాధారణ కలెక్షన్స్ అందుకోవడం. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ‘పుష్ప’ చిత్రం 365 కోట్ల వసూళ్లను సాధించి ట్రేడ్ పండితులని ఔరా అనిపించింది. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అల్లు అర్జున్ సరసన కథానాయికగా నటించగా, ఫహద్ ఫాసిల్ ప్రతినాయకుడిగా పరిచయం అయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రం రెండవ భాగం షూటింగ్ జరుపుకుంటోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.