సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ ట్రైలర్ రిలీజ్

martin luther king telugu movie trailer out now

హీరోగా చేయాలంటే మంచి ఫిజిక్, హైట్, అందం ఇలాంటి లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగే సత్తా ఉంటే చాలని ఇప్పటికే చాలామంది నిరూపించారు. అలాంటి వారిలో సంపూర్ణేష్ బాబు కూడా ఒకరు. హృదయ కాలేయం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు. మొదటిసినిమాతోనే ప్రేక్షకుల నుండి కావాల్సినంత అటెన్షన్ ను రాబట్టుకోగలిగాడు. ఇక ఆతరువాత సింగం 123, కొబ్బరిమట్ట, బజార్ రౌడీ, పెసరట్టు అంటూ డిఫరెంట్ టైటిల్స్ తో తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తన నుండి వస్తున్న సినిమా మార్టిన్ లూథర్ కింగ్. ఈసినిమా త‌మిళ్ కమెడియన్ యోగిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో వచ్చిన మండేలా సినిమాను రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగులో పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈసినిమా అక్టోబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహాయాన మోషన్ పిక్చర్స్, ఏపీఐ ఫిల్మ్స్ పతాకాలపై ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర, శిబాశిష్ సర్కార్, ఎల్. వేణుగోపాల్ తదితరులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. స్మరణ్ సాయిసాంగ్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 2 =