
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 36


సప్త సాగరాలు దాటి సైడ్-బి ట్రైలర్ వచ్చేస్తోంది

మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు అరుదైన గౌరవం
మా ఊరి పొలిమేర 2 టాక్

చిన్నారికి రౌడీ హీరో సాయం- ఎంపీ ప్రశంసలు

ఇండియన్ 2 ఇంట్రో గ్లింప్స్ రిలీజ్

ఖైదీ2 అందుకే లేట్ అవుతుంది

నెలకో సినిమాతో రానున్న శ్రీ లీల

స్టార్స్ తో ఇండియన్ 2 ఇంట్రడక్షన్ వీడియో

అయలాన్ ఓవర్సీస్ రిలీజ్ అప్ డేట్
తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటికే మహా వీరుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివకార్తికేయన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

తంగలాన్ గురించి విక్రమ్ చెప్పింది నిజం కాదు.. మేకర్స్ క్లారిటీ
పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఈసినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కి జనవరి 26వ తేదీన రిలీజ్ కానుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే రెండు రోజుల క్రితమే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

సప్త సాగరాలు దాటి సైడ్-బి ట్రైలర్ వచ్చేస్తోంది
‘777 చార్లీ’ సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అయిన కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ కన్నడ మూవీ 'సప్త సాగరదాచే ఎల్లో: సైడ్-ఏ'. ఈ మూవీలో రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. లవ్ స్టోరీ నేపథ్యంలో ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన ఈ చిత్రానికి యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. దీనికితోడు చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. దీంతో ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రేమ కథ రాలేదని కన్నడనాట ప్రేక్షకులు కితాబునివ్వడం గమనార్హం.

హాయ్ నాన్న- సోల్ ఫుల్ అమ్మాడి సాంగ్ రిలీజ్
శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార నాని, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈసినిమా ఫాదర్ అండ్ డాటర్ కాంబినేషన్ తో పాటు ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. అందులోనూ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈసినిమా డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.

మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు అరుదైన గౌరవం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన ఒక సినిమాకు అరుదైన గౌరవం లభించింది. అద్భుతమైన థ్రిల్లర్ కథాంశాలు కలిగిన అంతర్జాతీయ సినిమాల లిస్టులో స్థానం దక్కించుకుంది. 'కొల్లైడర్' అనే ప్రముఖ ఇంగ్లీష్ మేగజైన్ ప్రచురించిన కథనంలో మహేష్ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. కాగా ఈ మేగజైన్ పేర్కొన్న టాప్ 10 సినిమాల లిస్టులో మహేష్ చిత్రానికి 7వ స్థానం కల్పించింది. ఇక ఈ సినిమాల లిస్టులో హాలీవుడ్ స్టార్ హీరో 'టైటానిక్' ఫేమ్ లియోనార్డో డికాప్రియో నటించిన 'బ్లడ్ డైమండ్' 8వ స్థానంలో నిలవడం గమనార్హం. కోయెన్ బ్రదర్స్ స్వీయ దర్శకత్వం వహించిన 'నో కంట్రీ ఫర్…
మా ఊరి పొలిమేర 2 టాక్
మా ఊరి పొలిమేర రెండేళ్ల క్రితం ఓటిటి లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇందులో ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేశాయి.ఇక ఇప్పుడు మా ఊరి పొలిమేర 2 పేరుతో దానికి సీక్వెల్ ను తెరకెక్కించారు. రీసెంట్ గా విడుదలైన ప్రచార చిత్రాలు కూడా సినిమాకు హైప్ తెచ్చాయి.ఈరోజు ఈసినిమా పెద్దగా పోటీ లేకుండా థియేటర్లలోకి వచ్చింది.

మంగళవారం నుండి తరుణ్ అప్పడప్పడ తాండ్ర పెప్పీ సాంగ్ రిలీజ్
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా వస్తున్న సినిమా మంగళవారం. ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి కంటెంట్ ఒరియెంటెండ్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈ మూవీ నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తు సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

చిన్నారికి రౌడీ హీరో సాయం- ఎంపీ ప్రశంసలు
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలు రియల్ హీరలనిపించుకుంటారు. నిజ జీవితంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి హీరోల్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. విజయ్ దేవరకొండ కూడా పలువురికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. తను సంపాదించిన దానిలో కొంతభాగం ఇతరులకు సాయం చేయడానికి ఉపయోగిస్తుంటాడు. ఇప్పటికే పౌండేషన్ ద్వారా పలు సేవలు అందిస్తున్నాడు. ఇక తన ప్రతి బర్త్ డేకు స్పెషల్‌గా అందరికీ సర్ ప్రైజ్‌లు ఇస్తుంటాడు.

ఇండియన్ 2 ఇంట్రో గ్లింప్స్ రిలీజ్
స్టార్ డైరెక్టర్ శంకర్,లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇండియన్ 2.వీరి కాంబో లో ఇంతకుముందు వచ్చిన వచ్చిన కల్ట్ మూవీ ఇండియన్ కు సీక్వెల్ గా వస్తుంది ఈసినిమా.నిజానికి ఎపుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా మధ్యలో అనివార్యకారణాల వల్ల ఆగిపోయింది అయితే కొన్ని నెలల ముందు షూటింగ్ మళ్ళీ స్టార్ట్ కాగా ప్రస్తుతం తుది దశకు చేరుకుంది.

టాలీవుడ్‍లో విషాదం.. ప్రముఖ నటుడు ఈశ్వరరావు కన్నుమూత
దక్షిణాది చిత్ర పరిశ్రమలలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి మరణించిన విషయం తెలిసిందే. అలాగే విలక్షణ నటుడు నాజర్ తండ్రి కూడా కన్నుమూశారు. ఇక ఇది ఇలా ఉండగానే.. నిన్న కోలీవుడ్ ప్రముఖ నటుడు టీఎస్ బాలయ్య తనయుడు జూనియర్ బాలయ్య తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు ఇక లేరన్న వార్త వినిపించింది. ప్రముఖ సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. అయితే ఆయన మరణించిన వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భగవంత్ కేసరి.. మూడో వారంలోనూ అదే జోరు, 15 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి'. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ రోల్ ప్లే చేశారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రికార్డ్…

ఓటీటీలోకి వచ్చేసిన మ్యాడ్.. ఏ ప్లాట్‍ఫామ్‌లో అంటే?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయవుతూ తొలిప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం 'మ్యాడ్'. సూర్యదేవర నాగవంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. కంప్లీట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనిల్‌కుమార్, గోపికా ఉద్యాన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు.

కీడా కోలా హిలేరియస్ క్రైమ్ థ్రిల్లర్-తరుణ్ ఖాతాలో మరో హిట్
ఓవరాల్ గా చెప్పాలంటే కీడా కోలా సినిమా మంచి హిలేరియస్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల వారు ఈసినిమా నుండి రెండు గంటలపాటు హాయిగా నవ్వుకొని రిలాక్స్ అయ్యే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

బబుల్ గమ్ నుండి హబీబీ జిలేబీ సాంగ్ రిలీజ్
దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా వస్తున్న సినిమా బబుల్ గమ్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమాను చాలా సైలెంట్ గా పూర్తి చేశారు మేకర్స్. ఈమధ్యనే ప్రమోషన్ కార్యక్రమాలు పెట్టారు. ముందు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ తోనే అటెన్షన్ ను గ్రాబ్ చేశాడు రోషన్. ఇక ఆతరువాత రిలీజ్ చేసిన టీజర్ తో ఒక్కసారిగా సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాడు. ఫస్ట్ సినిమా అయినా రోషన్ చాలా ఈజ్ తో నటించినట్టే అనిపిస్తుంది. అంతేకాదు యూత్ ను ఈ సినిమా బాగానే ఆకట్టుకునేలా కనిపిస్తుంది.

మా ఊరి పొలిమేర 2 ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది - సత్యం రాజేష్
'మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం 'మా ఊరి పొలిమేర 2' డా.అనిల్ విశ్వనాథ్. దర్శకుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ముఖ్యతారలుగా నటిస్తున్న ఈ చిత్రంలో గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీకృష్ణ క్రియేషన్స్ బేనర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈరోజు (నవంబర్ 3, 2023) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు సత్యం రాజేష్…

నెట్టింట వైరల్‌గా.. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహ వేడుక ఫోటోలు
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలోని టస్కానీలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం బుధవారం (నవంబర్ 1, 2023) రాత్రి గం. 7:18 ని.లకు వీరు వేదమంత్రాల సాక్షిగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. వరుణ్ తేజ్ తల్లిదండ్రులు కొణిదెల నాగబాబు దంపతులు కొత్త కోడలిని సాదరంగా తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. సంప్రదాయబద్ధంగా పూర్తి భారతీయ శైలిలో వీరి వివాహం జరుగగా.. ఈ వేడుకలో కుటుంబ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు సహా మెగా-అల్లు కుటుంబ సభ్యులు హాజరై అక్షింతలతో నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు…

ఖైదీ2 అందుకే లేట్ అవుతుంది
దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈసినిమా.. మంచి విజయం దక్కించుకుంది. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు ఆడియన్స్‌ను కూడా ఈసినిమా ఆకట్టుకుంది. హీరోయిన్ .. పాటలు .. కామెడీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

నెలకో సినిమాతో రానున్న శ్రీ లీల
ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత బిజీ గా వున్న హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీ లీల.పెళ్లి సందడితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈబ్యూటీ అక్కడి నుండి వెనుదిరిగిచూసుకోలేదు.ప్రస్తుతం చేతిలో 5సినిమాలు వున్నాయి.ఆల్రెడీ ఈనెలలో భగవంత్ కేసరి తో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. అయితే ఇందులో హీరోయిన్ గా కాకుండా బాలయ్యకు కూతురిగా నటించింది.ఇక రానున్న మూడు నెలల్లో శ్రీలీల నెలకో సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది.

ఓటిటిల్లోకి స్కంద,జవాన్
గత నెలలో విడుదలైన రెండు మేజర్ సినిమాలు తాజాగా ఓటిటిల్లో కూడా రిలీజ్ అయ్యాయి.అందులో తెలుగు సినిమా స్కంద ఒకటి కాగా రెండోది బాలీవుడ్ మూవీ జవాన్.గత నెల 7న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది జవాన్.బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 1100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఈసినిమాతో షారుఖ్ వరుసగా రెండో విజయాన్ని సాధించడమే కాదు వరసగా 1000కోట్ల క్లబ్ లో చేరిన మొదటి బాలీవుడ్ హీరోగా రికార్డు సృష్టించాడు.

స్టార్స్ తో ఇండియన్ 2 ఇంట్రడక్షన్ వీడియో
లెజెండరీ డైరెక్టర్ శంకర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఇండియన్2 సినిమా ఒకటి. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలుసు. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. దాదాపు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.