తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటికే మహా వీరుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివకార్తికేయన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరోసినిమాతో వచ్చేస్తున్నాడు. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న సినిమా అయలాన్. సైన్స్ ఫిక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ కు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈసినిమా నుండి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈసినిమా ఓవర్సీస్ హక్కులను హంసిని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ వారు సొంతం చేసుకున్నారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.
Our cosmic adventure is set to invade screens worldwide 🛸We’re thrilled to announce that @Hamsinient has acquired the overseas distribution rights for #Ayalaan. Get ready for a close encounter of the cinematic kind! 💫 #AyalaanFromPongal #AyalaanFromSankranti#Ayalaan… pic.twitter.com/GhYWMDM3cE
— KJR Studios (@kjr_studios) November 4, 2023
కాగా ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.కెజెఆర్ స్టూడియోస్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: