కీడా కోలా హిలేరియస్ క్రైమ్ థ్రిల్లర్-తరుణ్ ఖాతాలో మరో హిట్

keedaa cola movie telugu review

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో బ్రహ్మానందం, చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కీడా కోలా. టైటిల్ తోనే ఈసినిమాపై క్యూరియాసిటీని పెంచాడు తరుణ్ భాస్కర్. ఇక ఈసినిమా రిలీజ్ అయిత టీజర్, ట్రైలర్ తో పాటు ప్రతి అప్ డేట్ కూడా సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేయడంతో సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా ఎలా ఉంది..ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్న విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. . చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, జీవన్ కుమారు తదితరులు
దర్శకత్వం.. తరుణ్ భాస్కర్
బ్యానర్స్..విజి సైన్మా బ్యానర్
నిర్మాతలు.. భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్
సంగీతం.. వివేక్ సాగర్
సినిమాటోగ్రఫి.. ఎజె ఆరోన్

కథ
వాసు (చైతన్య రావు) తన తాత వరదరాజు (బ్రహ్మానందం)తో కలిసి ఉంటాడు. వాసు స్నేహితుడు కౌశిక్ (రాగ్ మయూర్) ఒక లాయర్. వీరి ముగ్గురికీ డబ్బుతో చాలా అవసరం ఉంటుంది. ఇక డబ్బుకోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఒకరోజు కూల్ డ్రింక్ బాటిల్ లో బొద్దింకను చూస్తారు. దీంతో లాయర్ కు ఒక ఐడియా వస్తుంది. కంపెనీ యజమానికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ చేస్తారు.. మరోవైపు రౌడీ జీవన్ (జీవన్ కుమార్) కు కార్పొరేట్ అవ్వాలని ఉంటుంది. ఈ విషయాన్ని తన అన్న నాయుడు (తరుణ్ భాస్కర్) కు చెబుతాడు. అయితే దానికి చాలా డబ్బు కావాలి. డబ్బు కోసం ఒక ప్లాన్ వేస్తారు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి…? వాసు గ్యాంగ్, నాయుడు గ్యాంగ్ ఎలా కలిశాయి? రెండు గ్యాంగ్ లు కలిసి చివరికి ఎలాంటి ప్లాన్ వేశారు? ఫైనల్ గా వారికి డబ్బు వచ్చిందా? అన్నది మిగిలిన కథ.

విశ్లేషణ
కామెడీ ఎంటర్ టైనర్ లు, క్రైమ్ థ్రిల్లర్లు అంటే మన ఆడియన్స్ కు ఆల్ టైమ్ ఫేవరెట్స్. ప్రేక్షకులను రెండున్నర గంటలపాటు కడుపుబ్బా నవ్విస్తే చాలు లాజిక్స్ సైతం పక్కన పెట్టేసి సినిమాను హిట్ చేసేస్తారు. ఈమధ్య కాలంలో వచ్చిన మ్యాడ్ సినిమానే అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు.

ఇక అదే లాజిక్ వచ్చేశాడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతో నేషనల్ అవార్డును సొంతంచేసుకున్నాడు తరుణ్ భాస్కర్. ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది సినిమాను తీశాడు. ఈసినిమా కూడా హిట్ ను అందించింది. అయితే మూడో సినిమా తీయడానికే తరుణ్ భాస్కర్ కు చాలా ఏళ్లు పట్టింది. ఫైనల్లీ ఇప్పుడు కీడా కోలా అంటూ వచ్చాడు. అయతే ఈసారి ఆడియన్స్ ను రెండు గంటలు నవ్వించాలని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు. అందుకే కామెడీ కి సస్సెన్స్ ఎలిమెంట్స్ ను జోడించాడు.

దానికి తోడు మరో పాయింట్ ను కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. మనం కొనే వస్తువులో ఏదైనా లోపం ఉంటే వినియోగదారుల ఫోరమ్ కి వెళ్లొచ్చు అనే పాయింట్ ని క్రైమ్ కామెడీ నేపథ్యంలో చూపించారు. ఫస్ట్ హాఫ్ లో పాత్రలను గ్యాంగ్ లను పరిచయం చేసిన డైరెక్టర్ సెకండాఫ్ లో రివెంజ్, దాడులు ఉంటాయి. ఇక భూతులు తిట్టే సన్నివేశాల్లో డైరెక్టర్ పాత సినిమా పాటలు ప్లే చేయడం.. రెండు గ్యాంగ్ ల మధ్య వచ్చే సరెండర్ సీన్ అలా పలు సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి.

పెర్ఫామెన్స్

30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు ఆ వెబ్ సిరీస్ తో మంచి ఫేమ్ ను తెచ్చుకున్నాడు. ఇక ఈసినిమాలో కూడా తన నటనతో బాగానే మెప్పించాడు. నత్తి లాంటి వ్యాధితో బాధపడే యువకుడిగా. చాలీచాలని జీతంతో ఇబ్బంది పడే ఒక వీక్ పర్సన్ గా బాగా నటించాడు. బ్రహ్మానందం కూడా తన పాత్ర మేరకు బాగానే నటించారు. ముఖ్యంగా రాగ్ మయూర్, జీవన్ తమ కామెడీతో ఈ సినిమాకి ప్రాణం పోసారు. వారి డైలాగ్ డిక్షన్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక ఈసినిమాలో తరుణ్ భాస్కర్ కూడా ఒక రోల్ లో నటించిన సంగతి తెలిసిందే కదా. అయితే తరుణ్ భాస్కర్ కు నటించడం ఇదేం కొత్త కాదు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించాడు. ఈసినిమాలో కూడా నాయుడు పాత్రలో నటించి నవ్వించాడు. అంతేకాదు తరుణ్ భాస్కర్ పాత్ర కూడా సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అయింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.

టెక్నికల్ వాల్యూస్
ఇక సాంకేతిక విభాగం కూడా ఈసినిమాకు కలిసొచ్చింది. పాటల సంగతి పక్కనపడితే వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. ఇంకా ఎస్ జే ఆరోన్ అందించిన సినిమాటోగ్రఫి కూడా ఆకట్టుకుంటుంది. విజువల్స్ బాగున్నాయి. ఇంకా ఈసినిమాకు ఎడిటింగ్ కూడా కలిసొచ్చింది. మరీ లెంగ్తీ గా లేకుండా రెండు గంటలపాటు క్రిస్ప్ గా ఈసినిమాను కట్ చేశారు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే కీడా కోలా సినిమా మంచి హిలేరియస్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల వారు ఈసినిమా నుండి రెండు గంటలపాటు హాయిగా నవ్వుకొని రిలాక్స్ అయ్యే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.