తంగలాన్ గురించి విక్రమ్ చెప్పింది నిజం కాదు.. మేకర్స్ క్లారిటీ

thangalaan movie makers clarity on vikram dialogue

పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఈసినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కి జనవరి 26వ తేదీన రిలీజ్ కానుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే రెండు రోజుల క్రితమే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా టీజర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక కార్యక్రమంలో పాల్గొన్న విక్రమ్ నాకు ఈసినిమాలో డైలాగ్స్ లేవని.. శివపుత్రుడు తరహాలో ఉంటుందని అన్నారు. దీంతో విక్రమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈనేపథ్యంలో దీనిపై మేకర్స్ స్పందిస్తూ విక్రమ్ సార్ చెప్పింది వేరే రకంగా అర్థమైంది.. ఆయన చెప్పింది టీజర్ గురించి మాత్రమే.. మొత్తం సినిమా గురించి కాదు.. సినిమాలో ఆయనకు డైలాగ్స్ ఉన్నాయి.. అన్ని సన్నివేశాలను లైవ్ సౌండింగ్ తో తెరకెక్కించాం అంటూ క్లారిటీ ఇచ్చారు.

కాగా పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 13 =