నెట్టింట వైరల్‌గా.. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహ వేడుక ఫోటోలు

Varun Tej-Lavanya Tripathi's Wedding Ceremony Pics Goes Viral

టాలీవుడ్‌ మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలోని టస్కానీలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం బుధవారం (నవంబర్‌ 1, 2023) రాత్రి గం. 7:18 ని.లకు వీరు వేదమంత్రాల సాక్షిగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. వరుణ్ తేజ్ తల్లిదండ్రులు కొణిదెల నాగబాబు దంపతులు కొత్త కోడలిని సాదరంగా తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. సంప్రదాయబద్ధంగా పూర్తి భారతీయ శైలిలో వీరి వివాహం జరుగగా.. ఈ వేడుకలో కుటుంబ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు సహా మెగా-అల్లు కుటుంబ సభ్యులు హాజరై అక్షింతలతో నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింటి వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా వరుణ్‌, లావణ్యల వివాహానికి హాజరైన వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-అన్నా లెజ్నెవా, రామ్‌చరణ్-ఉపాసన, అల్లు అర్జున్‌-స్నేహా, హీరో నితిన్-షాలిని జంటలతో పాటు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్‌ తేజ్‌, అల్లు శిరీష్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీరజా కోన తదితరులు ఉన్నారు. వివాహం అనంతరం చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ సహా మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో కనువిందు చేశారు. నూతన దంపతులతో కలిసి వీరు ఫొటో దిగారు. దీనికి సంబంధించిన ఫొటోను చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇరువురూ చిరునవ్వులు చిందిస్తున్న పిక్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ నూతన వధూవరులతో దిగిన ఫొటో కూడా నెట్టింట సందడి చేస్తున్నాయి. అలాగే వీటితో పాటుగా వరుణ్‌ తేజ్‌ సోదరి, నటి నిహారిక కొణిదెల మరియు నటుడు నితిన్ దంపతులు కూడా కొత్త జంటతో ఫోటోలు దిగగా.. వీటన్నింటిని మెగా ఫ్యాన్స్ షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

కాగా వివాహ వేడుకల్లో భాగంగా అంతకుముందు జరిగిన కాక్‌టెయిల్, హల్దీ, మెహందీ సెలెబ్రేషన్స్‌ను నిర్వహించగా అతిథులందరూ పాల్గొని సందడి చేశారు. అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహానికి మెగా-అల్లు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వరుణ్ ఈ వేడుకను పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించుకోవాలని నిర్ణయించిన క్రమంలో వెడ్డింగ్‌ను ఇటలీలో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నవంబర్ 5వ తేదీన మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగు చిత్ర పరిశ్రమలోని ముఖ్యుల కోసం ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. కాగా ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం VarunLav అనే హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిన సంగతే. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీరు వివాహం చేసుకున్నారు. దీనిలో భాగంగా కొన్ని నెలల క్రితం వీరి నిశ్చితార్ధం జరుగగా.. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇటలీలో వివాహం జరిగింది. ఈ క్రమంలో ఇప్పటికే వరుణ్‌ తేజ్‌, లావణ్య వెడ్డింగ్‌ కార్డ్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే, ఇటీవలే ‘గాంఢీవధారి అర్జున’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే మూవీలో నటిస్తున్నారు. అలాగే ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ‘మట్కా’ అనే సినిమాను చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.