ఓటీటీలోకి వచ్చేసిన మ్యాడ్.. ఏ ప్లాట్‍ఫామ్‌లో అంటే?

MAD Movie Now Streaming on Netflix

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయవుతూ తొలిప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం ‘మ్యాడ్’. సూర్యదేవర నాగవంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. కంప్లీట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనిల్‌కుమార్, గోపికా ఉద్యాన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరో జూ. ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవగా.. ‘బలగం’ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించాడు. ఈనెల 6న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని అంచనాలకు మించి హిట్ అనిపించుకుంది. ఇంజినీరింగ్ కాలేజీ నేపథ్యంలో కామెడీ ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సెంట్ పెర్సెంట్ సక్సెస్ అయింది. చిన్న బడ్జెట్‌ సినిమాగా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

ఈ క్రమంలో టోటల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 20 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ఏ లో సైతం 500k డాలర్లను రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ప్లాట్‍ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో నేటినుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. సో.. ఈ సినిమాను థియేటర్లలో మిస్సయిన వారు ఎంచక్కా ఇంట్లోనే చూసేయండి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 2 =