రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలు రియల్ హీరలనిపించుకుంటారు. నిజ జీవితంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి హీరోల్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. విజయ్ దేవరకొండ కూడా పలువురికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. తను సంపాదించిన దానిలో కొంతభాగం ఇతరులకు సాయం చేయడానికి ఉపయోగిస్తుంటాడు. ఇప్పటికే పౌండేషన్ ద్వారా పలు సేవలు అందిస్తున్నాడు. ఇక తన ప్రతి బర్త్ డేకు స్పెషల్‌గా అందరికీ సర్ ప్రైజ్‌లు ఇస్తుంటాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు విజయ్ దేవరకొండ. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ చిన్నరి రోడు ప్రమాదంలో తన కాలును పోగొట్టుకుంది. ఇక ఈవార్త సోషల్ మీడియా ద్వారా విజయ్ దేవరకొండ వరకూ చేరింది. దీంతో విజయ్ దేవరకొండ ఆ చిన్నరికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాడు. ఇక ఈ విషయంపై ఆ జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించి విజయ్ ను ప్రశంసించారు. సోషల్ మీడియా ద్వారా కూడా విజయ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా డీసెంట్ హిట్ ను అందించింది. ఇప్పుడు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: