మా ఊరి పొలిమేర రెండేళ్ల క్రితం ఓటిటి లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇందులో ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేశాయి.ఇక ఇప్పుడు మా ఊరి పొలిమేర 2 పేరుతో దానికి సీక్వెల్ ను తెరకెక్కించారు. రీసెంట్ గా విడుదలైన ప్రచార చిత్రాలు కూడా సినిమాకు హైప్ తెచ్చాయి.ఈరోజు ఈసినిమా పెద్దగా పోటీ లేకుండా థియేటర్లలోకి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.మొదటి భాగం కంటే రెండో భాగం ఎక్కువ థ్రిల్ చేసిందని పర్ఫెక్ట్ సీక్వెల్ అంటూ చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.సత్యం రాజేష్ నటన ,ఇంటర్వెల్ సీక్వెన్స్ ,ట్విస్టులు,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్ అయ్యాయట.హర్రర్ థ్రిల్లర్ లు ఇష్ట పడేవారికి ఈసినిమా బాగా నచ్చుతుందట.సో థ్రిల్లర్ మూవీ లవర్స్ కు ఈవారం ఈసినిమా మంచి ఆప్షన్ కానుంది.
స్టార్ క్యాస్ట్ ఎవరు లేకుండా వచ్చిన ఈసినిమాకు ఓపెనింగ్స్ కూడా డీసెంట్ గా వున్నాయి.ఈరోజు ఈసినిమాతో కీడా కోలా ఒకటే రిలీజ్ కావడంతో మా ఊరి పొలిమేర 2 కు చాలా వరకు థియేటర్లు దొరికాయి దానికి తోడు టాక్ కూడా బాగుండడం తో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.అనిల్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో సత్యం రాజేష్ తోపాటు కామాక్షి భాస్కర్ల ,బాలాదిత్య,జబర్దస్త్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: