దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా వస్తున్న సినిమా బబుల్ గమ్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమాను చాలా సైలెంట్ గా పూర్తి చేశారు మేకర్స్. ఈమధ్యనే ప్రమోషన్ కార్యక్రమాలు పెట్టారు. ముందు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ తోనే అటెన్షన్ ను గ్రాబ్ చేశాడు రోషన్. ఇక ఆతరువాత రిలీజ్ చేసిన టీజర్ తో ఒక్కసారిగా సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాడు. ఫస్ట్ సినిమా అయినా రోషన్ చాలా ఈజ్ తో నటించినట్టే అనిపిస్తుంది. అంతేకాదు యూత్ ను ఈ సినిమా బాగానే ఆకట్టుకునేలా కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. హబీబీ జిలేబీ అంటూ వచ్చే ఈ పాటను విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈపాట కూడా ఆకట్టుకుంటుంది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడగా.. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించాడు.
కాగా ఈసినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం.. సురేష్ రగుతు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























