శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార నాని, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈసినిమా ఫాదర్ అండ్ డాటర్ కాంబినేషన్ తో పాటు ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. అందులోనూ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈసినిమా డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సమయమా, గాజు బొమ్మ అంటూ రెండు పాటలు రిలీజ్ చేయగా.. మొదటి పాట నాని, మృణాల్ మధ్య ఉంటుంది.. అలానే గాజ్ బొమ్మ సాంగ్ కూతరి మీద ఉంటుంది.. ఇక ఇప్పుడు మూడో పాట కూడా నాని, మృణాల్ మధ్య రాబోతుంది. తాజాగా మూడో పాటను కూడా రిలీజ్ చేశారు. అమ్మాడి అంటూ వచ్చే ఈపాట ఆకట్టుకుంటుంది. ఈ పాటలో నాని -మృణాల్ కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
Their sweet and adorable love story calls for a BIG CELEBRATION! 🥳
Experience a new chapter of LOVE now ❤️
– https://t.co/ANsBkieNmW#Ammaadi #Maiyal #Andhaaju #Melleishtam #Pyaralaage #HiNanna #HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7th
Natural 🌟 @NameIsNani @Mrunal0801… pic.twitter.com/ZJ0yA6KYnk
— Vyra Entertainments (@VyraEnts) November 4, 2023
ఇక ఈసినిమాలో నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: