మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు అరుదైన గౌరవం

Rare Achievement For Mahesh Babu and Trivikram's Khaleja Movie

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన ఒక సినిమాకు అరుదైన గౌరవం లభించింది. అద్భుతమైన థ్రిల్లర్ కథాంశాలు కలిగిన అంతర్జాతీయ సినిమాల లిస్టులో స్థానం దక్కించుకుంది. ‘కొల్లైడర్’ అనే ప్రముఖ ఇంగ్లీష్ మేగజైన్ ప్రచురించిన కథనంలో మహేష్ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. కాగా ఈ మేగజైన్ పేర్కొన్న టాప్ 10 సినిమాల లిస్టులో మహేష్ చిత్రానికి 7వ స్థానం కల్పించింది. ఇక ఈ సినిమాల లిస్టులో హాలీవుడ్ స్టార్ హీరో ‘టైటానిక్’ ఫేమ్ లియోనార్డో డికాప్రియో నటించిన ‘బ్లడ్ డైమండ్’ 8వ స్థానంలో నిలవడం గమనార్హం. కోయెన్ బ్రదర్స్ స్వీయ దర్శకత్వం వహించిన ‘నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్’ అనే సినిమా మొదటి స్థానంలో నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇంతకీ ఈ లిస్టులో ప్లేస్ దక్కించుకున్న మహేష్ బాబు సినిమా ఏదంటే.. ‘ఖలేజా’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది. ఈ యాక్షన్ కామెడీ సినిమా, అనేక మంది ప్రాణాలను బలిగొన్న ఒక రహస్యమైన మరియు ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న ఒక గ్రామం యొక్క కథను గురించి వివరిస్తుంది. ఇక ఆ గ్రామ పెద్ద తమ గ్రామాన్ని కాపాడే రక్షకుని రాక గురించిఎదురుచూస్తున్న క్రమంలో కథానాయకుడు రాజు, క్యాబ్ డ్రైవర్ (మహేష్ బాబు) కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా ఆ గ్రామానికి వస్తాడు. గ్రామస్తులు, అతడిని తమ కష్టాలు తీర్చడానికి వచ్చిన దైవ దూతగా నమ్ముతారు. అయితే తొలుత రాజు వారి సమస్యను పట్టించుకోడు. కానీ అక్కడి పసిబిడ్డలు మరణానికి చలించి దీనికి కారణమైన మూల సమస్యను గుర్తించి ఆ గ్రామాన్ని, అక్కడి ప్రజలను ఎలా రక్షించడానికి ప్రయత్నిస్తాడు అనేది మిగిలిన కథ.

కాగా ఇది మహేష్-త్రివిక్రమ్ కలయికలో వచ్చిన రెండో చిత్రం కావడం గమనార్హం. అంతకుముందు వీరి కాంబోలో తొలిసారిగా ‘అతడు’ అనే సినిమా వచ్చింది. ఇక ఇదిలా ఉండగా.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న మూడో సినిమా ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − 1 =