
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 160


శాకుంతలం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ అభిమానుల , మీడియా సందడి

#SSMB 28 మూవీ లో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల

ఉస్తాద్ భగత్ సింగ్- టైటిల్ ట్రాక్ కంప్లీట్

షూటింగ్ పూర్తిచేసుకున్న మైఖేల్

#SSMB 28 మూవీ రిలీజ్ డేట్

100 కోట్ల క్లబ్ లో వాల్తేరు వీరయ్య

ఇంటర్ నేషనల్ అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ మూవీ హవా

రామ్ చరణ్ సాలిడ్ లైనప్

హీరో నాని న్యూ లుక్

హీరో నాని దసరా మూవీ షూటింగ్ పూర్తి

ఆదిపురుష్ పై సినిమాటోగ్రాఫర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో వీఎఫ్ఎక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మాత్రమే ఎక్కువ టైము పడుతుంది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి టీజర్ ను ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ టీజర్ కు కాస్త నెగెటివ్ కామెంట్స్ వచ్చిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా గ్రాఫిక్స్ విషయంలో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ పెదవి…

శాకుంతలం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
రీసెంట్ గానే యశోద లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో అలరించిన సమంత ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని ఆది పర్వం.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఫిబ్రవరి 17వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలను పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి…

వారిసు కలెక్షన్స్ - 5 రోజుల్లో 150 కోట్లు
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా వారిసు. ఈసినిమా తెలుగులో వారసుడు తమిళంలో ‘వారిసు’ అనే పేరుతో రిలీజ్ అయింది. సంక్రాంతికి బరిలో దిగిన ఈసినమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ముందు తమిళ్ లో జనవరి 11వ తేదీన ఈసినిమా రిలీజ్ అయింది. తమిళంలో ‘వారిసు’ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. విజయ్ చాలా కాలం తరవాత చేసిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ఇక ఇక్కడ జనవరి 14వ తేదీన ఈసినిమా రిలీజ్ అయింది. ఇక్కడ కూడా ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
రాజమౌళి తో జేమ్స్ కామెరూన్ - ఇప్పటికీ నమ్మలేకపోతున్నా సర్
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తారో తెలియంది కాదు. ఇక కాస్త లేట్ అయినా కూడా రాజమౌళి ప్రేక్షకులకు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అవన్నీ సినిమాలో ఉండేలా చిత్రీకరిస్తుంటాడు. అందుకే ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా కూాడా అలాంటి రికార్డులే క్రియేట్ చేసింది.

జపాన్ - కార్తీ స్టైలిష్ పోస్టర్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస హిట్లతో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. పొన్నియిన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్న కార్తీ.. వెంటనే మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. ప్రస్తుతం రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్కు కే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్ లో కార్తీ స్టైలిష్…

ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ అభిమానుల , మీడియా సందడి
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ లోని నాటు నాటు సాంగ్ కి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. ఈ పాటకి హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. RRR సినిమా తాజాగా ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకుంది. నాటు నాటు పాటకి గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఈ పాటకు సంగీతం అందించిన దర్శకుడు కీరవాణి అందుకున్నారు. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్…

#SSMB 28 మూవీ లో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల
కమర్షియల్ హిట్ పెళ్ళిసందD మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, వైష్ణవ్‌తేజ్ మూవీ, గాలి జనార్ధన్‌రెడ్డి తనయుడు హీరోగా పరిచయమవుతున్న మూవీ, రామ్ హీరోగా తెరకెక్కుతున్న #RAPO 20, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #NITHIN32, #NBK108 మూవీస్ లో శ్రీలీల నటిస్తున్నారు.

కీర్తి సురేష్ రివాల్వర్ రీటా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీతో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. దసరా, భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్, సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. షూటింగ్స్ తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలో తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పలు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరించిన కీర్తి ఇప్పుడు మరో ఉమెన్ సెంట్రిక్ మూవీ తో అలరించనున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్- టైటిల్ ట్రాక్ కంప్లీట్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూసే సినిమాల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాను ప్రకటించిన దగ్గరనుండే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమాకు ముందు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను అనుకున్నారు.. ఆతరువాత ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు. ఇన్ని రోజులు ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది చిత్రయూనిట్. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా టైటిల్ ట్రాక్ కంప్లీట్ అయినట్టు…

ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రశంసలు
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అఖండ విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ తాజాగా 28వ వార్షిక క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ (CCA)లో రెండు అవార్డులను గెలుచుకుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం మరియు ఉత్తమ పాటల విభాగాలలో అవార్డులను గెలుచుకుంది.

షూటింగ్ పూర్తిచేసుకున్న మైఖేల్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా మైఖేల్.డైరెక్టర్ రంజిత్ జయకోడి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు. ఒకపక్క షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఈసినిమా పలు పోస్టర్లు, అలానే టీజర్ కూడా రిలీజ్ అయింది. ఇవి సినిమాపై అంచనాలను బాగానే పెంచేశాయి. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను కంప్లీట్…

#SSMB 28 మూవీ రిలీజ్ డేట్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

రిలీజ్ అయిన అన్ స్టాపబుల్ 2 పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ గ్లింప్స్
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ లో హీరో ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ఆహా ప్రసారం చేయగా సరదా సరదా ప్రశ్నలు ఎంటర్టైన్మెంట్ అంశాలతో కొనసాగి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఎపిసోడ్ ను త్వరలో ఆహా ప్రసారం చేయనుంది.

100 కోట్ల క్లబ్ లో వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ అభిమానులకు నిజమైన పండుగను అందించారు చిరంజీవి. గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చేశారు. ఎప్పటినుండో మెగాస్టార్ అభిమానులు మంచి మాస్ ఎంటర్ టైనర్ ను కోరుకుంటున్నారు. ఇక వారి కోరిక వాల్తేరు వీరయ్య తో తీర్చేశాడు బాబి. మాస్ మహారాజ రవితేజ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైంది. మెగాస్టార్ నటన, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయ. ఇక ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది.

ఇంటర్ నేషనల్ అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ మూవీ హవా
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అఖండ విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ మూవీ ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఇండియా వ్యాప్తంగా ప్రముఖులు, స్టార్స్, పొలిటికల్ లీడర్స్ ఆర్ఆర్ఆర్ టీమ్ ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ జోరు- తెలుగులో 16 సినిమాలు
ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కూడా తమ జోరును సాగిస్తున్నాయి. ఒకప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లేకపోవడం వల్ల సినీ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేవాళ్లు. కానీ ఇప్పుడు కాస్త పరిస్థితి మారిందని చెప్పొచ్చు. థియేటర్లకు మునుపటి కంటే ప్రేక్షకులు తగ్గారని కూడా చెప్పొచ్చు.. సినిమా అంటే పిచ్చి ఉన్నవాళ్లు, థియేటర్లలో నే సినిమా చూసి ఎంజాయ్ చేయాలి అనుకునేవాళ్లు ఖచ్చితంగా థియేటర్లకు వెళుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఓటీటీల్లోనే చూసేస్తున్నారు. అందుకే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటూ సందడి చేస్తున్నాయి. అంతేకాదు థియేట్రికల్ రిలీజ్ తర్వాత వీలైనంత తొందరగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో…

రామ్ చరణ్ సాలిడ్ లైనప్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఆర్సీ 15. లెజెండ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం శంకర్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు రామ్ చరణ్. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

హీరో నాని న్యూ లుక్
విభిన్న కథా చిత్రాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న న్యాచురల్ స్టార్ నాని మరో డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కుతున్న దసరా మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. దసరా…

ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ పై బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రశంసలు
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అఖండ విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ తాజాగా ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఎన్టీఆర్, చరణ్, కీరవాణి, రాజమౌళి ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఆ అవార్డ్ ను సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు.

హీరో నాని దసరా మూవీ షూటింగ్ పూర్తి
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. హీరో నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన నేను లోకల్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.