వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా వారిసు. ఈసినిమా తెలుగులో వారసుడు తమిళంలో ‘వారిసు’ అనే పేరుతో రిలీజ్ అయింది. సంక్రాంతికి బరిలో దిగిన ఈసినమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ముందు తమిళ్ లో జనవరి 11వ తేదీన ఈసినిమా రిలీజ్ అయింది. తమిళంలో ‘వారిసు’ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. విజయ్ చాలా కాలం తరవాత చేసిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ఇక ఇక్కడ జనవరి 14వ తేదీన ఈసినిమా రిలీజ్ అయింది. ఇక్కడ కూడా ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు ఈసినిమా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇది కేవలం తమిళ వెర్షన్ కలెక్షన్ మాత్రమే. మరి తమిళ్ లోనే ఈ రేంజ్ లో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది అంటే మాములు విషయం కాదు. ఇక తెలుగులో ‘వారసుడు’ మూవీ రెండు రోజులలో రూ.11.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది.

ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించరు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























