శాకుంతలం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

Shaakuntalam First Single Release Date Fixed, Shaakuntalam First Single, Dev Mohan, Samantha Ruth Prabhu, Aditi Balan, Prakash Raj, Gunasekhar, Samantha Movies, Samantha Latest Movie, Samantha Upcoming Movie, Shaakuntalam, Shaakuntalam 2023, Shaakuntalam Movie, Shaakuntalam Update, Shaakuntalam Latest News, Shaakuntalam Telugu Movie, Shaakuntalam Movie Live Updates, Shaakuntalam Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

రీసెంట్ గానే యశోద లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో అలరించిన సమంత ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని ఆది పర్వం.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఫిబ్రవరి 17వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలను పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఈసినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. శాకుంతలం మూవీ నుండి మల్లిక మల్లిక అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని జనవరి 18న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 15 =