100 కోట్ల క్లబ్ లో వాల్తేరు వీరయ్య

Waltair Veerayya Movie Joins In 100 Crores Club, Waltair Veerayya Joins In 100 Crores Club, 100 Crores Club, Waltair Veerayya Movie, Megastar Chiranjeevi, Chiranjeevi, Ravi Teja, Shruti Haasan, K. S. Ravindra, Chiranjeevi Movies, Chiranjeevi Latest Movie, Chiranjeevi Upcoming Movie, Waltair Veerayya, Waltair Veerayya 2023, Waltair Veerayya Movie, Waltair Veerayya Update, Waltair Veerayya Latest News, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Movie Live Updates, Waltair Veerayya Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మెగాస్టార్ అభిమానులకు నిజమైన పండుగను అందించారు చిరంజీవి. గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చేశారు. ఎప్పటినుండో మెగాస్టార్ అభిమానులు మంచి మాస్ ఎంటర్ టైనర్ ను కోరుకుంటున్నారు. ఇక వారి కోరిక వాల్తేరు వీరయ్య తో తీర్చేశాడు బాబి. మాస్ మ‌హారాజ ర‌వితేజ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న విడుద‌లైంది. మెగాస్టార్ నటన, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయ. ఇక ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్‌ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకెళ్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అంతేకాదు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా తొలి 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. 3 రోజుల్లోనే 108 కోట్లను రాబట్టింది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ కూడా పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆనందాన్ని తెలియచేశారు. ఇక్కడ మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా ఈసినిమా కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే 1 మిలియన్ డాలర్స్ పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. ఇంకా ఈసినిమాలో ప్రకాష్ రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు నటించారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + twelve =