స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ లోని నాటు నాటు సాంగ్ కి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. ఈ పాటకి హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. RRR సినిమా తాజాగా ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకుంది. నాటు నాటు పాటకి గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఈ పాటకు సంగీతం అందించిన దర్శకుడు కీరవాణి అందుకున్నారు. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకకి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి సతీ సమేతంగా హాజరు అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాస్ ఏంజెల్స్ లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకకు అటెండ్ అయిన ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎన్టీఆర్ రాకతో ఎయిర్ పోర్ట్ సందడిగా మారింది. ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ అభిమానులు, మీడియా సందడి చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: