రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తారో తెలియంది కాదు. ఇక కాస్త లేట్ అయినా కూడా రాజమౌళి ప్రేక్షకులకు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అవన్నీ సినిమాలో ఉండేలా చిత్రీకరిస్తుంటాడు. అందుకే ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా కూాడా అలాంటి రికార్డులే క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమాకు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమాలో నాటు నాటు సాంగ్ కు ప్రముఖ గోల్డెన్ గ్లోబ్ అవార్డు ను సొంతం చేసుకుంది. మరోవైపు ఈసినిమాపై హాలీవుడ్ డైరెక్టర్స్ ఎంతో మంది ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఏకంగా ‘టైటానిక్’, ‘అవతార్’ లాంటి విజువల్ వరండర్స్ సృష్టించిన జేమ్స్ కామెరూన్ రాజమౌళిని ప్రశంసించారు. తాజాగా అమెరికా లాస్ ఏంజిల్స్ లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నాడు రాజమౌళి. అక్కడ జేమ్స్ కామెరూన్ రాజమౌళితో ముచ్చటించారు.
ఇక ఈవిషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గ్రేట్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ ను చూశారు. ఆయనకు ఈ సినిమా ఎంతో భాగా నచ్చింది. అతడు తన భార్య సుజీని కూడా ఈ సినిమా చూడాలని చెప్పారు. అంతేకాదు, ఆమెతో కలిసి మళ్ళీ చూశారు. సార్! మీరు మా సినిమా గురించి విశ్లేషించడానికి 10 నిమిషాలు గడిపారు. ఇంత సమయం మాకు ఇస్తారని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మీరు చెప్పినట్లు నేను ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాను. మీకు మీ సతీమణికి ధన్యవాదాలు” అని రాజమౌళి ట్వీట్ చేశారు.
The great James Cameron watched RRR.. He liked it so much that he recommended to his wife Suzy and watched it again with her.🙏🏻🙏🏻
Sir I still cannot believe you spent a whole 10 minutes with us analyzing our movie. As you said I AM ON TOP OF THE WORLD… Thank you both 🥰🥰🤗🤗 pic.twitter.com/0EvZeoVrVa
— rajamouli ss (@ssrajamouli) January 16, 2023
ఎమ్ ఎమ్ కీరవాణి సైతం జేమ్స్ కామెరూన్ గురించి ట్వీట్ చేశారు. గ్రేట్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ ని రెండుసార్లు చూశారు. నా స్కోర్ పై ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. ఓషన్ ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఫీలవుతున్నా అని ట్వీట్ లో పేర్కొన్నారు.
The great James Cameron has watched RRR twice and gave feedback on my score !!! Ocean full of excitement ☺️☺️☺️ pic.twitter.com/3PrrhMUAIx
— mmkeeravaani (@mmkeeravaani) January 16, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
Jr NTR Teases SS Rajamouli on Live | Funny Video | RRR Telugu Press Meet | Ram Charan | Alia Bhatt05:38 Prabhas About Guest Role in RRR Movie | Radhe Shyam Interview | SS Rajamouli | Pooja Hegde | Radha04:35 Jr NTR and Ram Charan Raise Awareness about Corona Virus | RRR | Jr NTR | Ram Charan01:48 Ram Charan Reveals Story Behind The Birth of RRR | RRR Movie Press Meet | Jr NTR | SS Rajamouli03:43
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: