స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అఖండ విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ తాజాగా ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఎన్టీఆర్, చరణ్, కీరవాణి, రాజమౌళి ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఆ అవార్డ్ ను సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
This should be our victory dance after yesterday🇮🇳😁⚡️huge win for Indian Cinema! congratulations to the whole team of RRR @ssrajamouli @MMKeeravani_FC @tarak9999 @AlwaysRamCharan pic.twitter.com/lbo8F0B7nb
— Tiger Shroff (@iTIGERSHROFF) January 12, 2023
ఈ నేపథ్యంలో ఇండియా వ్యాప్తంగా ప్రముఖులు, స్టార్స్, పొలిటికల్ లీడర్స్ ఆర్ఆర్ఆర్ టీమ్ ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ స్టార్స్ మాత్రం ఓ రేంజ్ లో ఆర్ఆర్ఆర్ ఘనతను చూపి పొంగిపోతున్నారు. ఇండియన్ కు దక్కిన అరుదైన ఘనతగా చెబుతూ ఇదొక ప్రౌడ్ మూవ్ మెంట్ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నాటు నాటు పాటకు చక్కటి స్టెప్స్ వేసిన టైగర్ ఇది నిన్నటి విజయం తరువాత మా విజయ నృత్యం. భారతీయ సినిమాకు ఇది భారీ విజయం. ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ మొత్తానికి అభినందనలు అంటూ తన డ్యాన్స్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: