
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 135


సామ్ కు ఖుషి టీమ్ గ్రాండ్ వెల్ కమ్

ప్రభాస్ వల్లే ప్రాజెక్ట్ K సాధ్యం

హోలీ సంబరాల్లో తమన్నా

CSI సనాతన్ సెన్సార్ కంప్లీట్

నా కొడుకుకి ఫస్ట్ ఆ సినిమానే చూపిస్తా

ప్రారంభం అయిన లాల్ సలామ్ మూవీ షూటింగ్

ముంబై హోలీ వేడుకల్లో హీరో నాని

సోల్ ఆఫ్ రంగమార్తాండ

100 రోజుల్లో ఆదిపురుష్ బ్లాస్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్

ఈ నగరానికి ఏమైంది- ధమ్కీ ముందే రీ రిలీజ్

యూ ఎస్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్

మహిళలకు మహేష్ బాబు ఉమెన్స్ డే స్పెషల్ విషెస్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #SSMB 28 మూవీ లో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు ప్రతీ విషయానికి స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ తెలిపారు.

సామ్ కు ఖుషి టీమ్ గ్రాండ్ వెల్ కమ్
శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మహానటి తర్వాత విజయ్‌దేవరకొండ, సమంత కలిసి నటిస్తోన్నసినిమా ఇది. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే మధ్యలో సమంత వేరే సినిమాలతో బిజీగా ఉండటం.. అందులోనూ అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.

ప్రభాస్ వల్లే ప్రాజెక్ట్ K సాధ్యం
టాలీవుడ్ స్టార్ హీరో స్థాయి నుండి పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగిన హీరో ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలో. అందులో ఒకటే ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఒకటి. నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాను నాగ్ అశ్విన్ ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడో ఇటీవలే ఈసినిమా కోసం వాడే ఒక టైర్ మేకింగ్ కు సంబంధించి ఒక వీడియో ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఆ చిన్న గ్లింప్స్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు.

హోలీ సంబరాల్లో తమన్నా
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సూపర్ హిట్ మూవీస్ లో తమన్నా తన అందం అభినయనయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు స్పెషల్ సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిం చారు. తమన్నా ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్, రజనీకాంత్ జైలర్ (తమిళ ), బంద్రా (మలయాళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

CSI సనాతన్ సెన్సార్ కంప్లీట్
ఆది సాయికుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన లిస్ట్ లో దాదాపు ఆరడజను సినిమాలు ఉన్నాయి. అందులో ‘CSI సనాతన్’ ఒకటి. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు శివశంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరో పాపులర్ అమెరికన్ టాక్ షో కి గెస్ట్ గా రామ్ చరణ్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

ఉగాది పండగ కి నాగార్జున న్యూ మూవీ ఫస్ట్ లుక్ ?
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా ఒక యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో మాజీ మిస్ ఇండియా మానస వారణాసి కథానాయికగా నటించే అవకాశం ఉంది. ఈ మూవీ లో కామెడీ హీరోలు అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ తో రైటర్ ప్రసన్న కుమార్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

రానా నాయుడు వెబ్ సిరీస్ లో సవాల్ విసిరిన పాత్ర నాగ నాయుడు - వెంకటేష్
లోకోమోటివ్ గ్లోబల్ ఇంక్ బ్యానర్ పై కరణ్ అన్షుమన్ దర్శకత్వంలో రానా, వెంకటేష్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ డ్రామా రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ద్వారా మార్చి 10 వ తేదీ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో సుచిత్ర పిళ్ళై, సుర్వీన్ చావ్లా, గౌరవ్ చోప్రా ముఖ్య పాత్రలలో నటించారు. సంగీత్ – సిద్ధార్ధ్ సంగీతం అందించారు. ఈ వెబ్ సీరీస్ లో వెంకటేష్, తాను తండ్రీకొడుకులుగా నటించామనీ చెప్పారు. రియల్ బాబాయ్, కొడుకులు రీల్ లైఫ్ లో తండ్రీకొడుకులు గా నటించడం విశేషం.

నా కొడుకుకి ఫస్ట్ ఆ సినిమానే చూపిస్తా
టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లు స్టార్ హీరోగా రాణించింది కాజల్ అగర్వాల్. తన నటనతో, అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా పలువురు స్టార్ హీరోలతో నటించింది. అయితే హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉండగానే వివాహా బంధంలోకి అడుగుపెట్టింది. గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ వివాహం అక్టోబర్ 30, 2020లో జరిగింది. ఆ వెంటనే తల్లి కూడా అయిపోయింది. ప్రస్తుతం తనకు నీల్ కిచ్లూ అనే తనయుడు కూడా ఉన్నాడు.

రైటర్ పద్మభూషణ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వీడియోలతో మొదలుపెట్టి తన నటనతో ఆకట్టుకొని ఆ తరువాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి అనంతరం కలర్ ఫోటో సినిమాతో హీరో అయ్యాడు సుహాస్. కలర్ ఫొటో సినిమాకు అవార్డులు సైతం దక్కాయి. ఇక రీసెంట్ రైటర్ పద్మభూషణ్ సినిమాతో మరోసారి తన సత్తాను చూపించాడు. సుహాస్ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమా రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కామెడీ, ఎమోషన్, అమ్మ సెంటిమెంట్ సినిమాలో బాగా వర్కవుట్ అయింది. దీంతో రిలీజయిన మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ తెచ్చుకొని, ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఇక మంచి కలెక్షన్స్ సైతం…

#NBK108 మూవీ లో హీరో బాలకృష్ణ కు జోడీగా కాజల్ అగర్వాల్
అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు భారీ సక్సెస్ లు సొంతం చేసుకుని ఉల్ జోష్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం షైన్ క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న #NBK108 మూవీలో ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. యువ మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ప్రారంభం అయిన లాల్ సలామ్ మూవీ షూటింగ్
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ పై ఐశ్వర్య దర్శకత్వంలో సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ ప్రధాన పాత్రలో క్రీడా మరియు మత కల్లోల కథాంశంతో లాల్ సలామ్ తమిళ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో విష్ణు విశాల్ కథానాయకుడు కాగా విక్రాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లాల్ సలామ్ మూవీలో జీవిత రాజశేఖర్, రజనీకాంత్ సోదరి పాత్రలో నటిస్తున్నారు. మార్చి 7న చెన్నైలో ప్రారంభం కానున్న ఈ మూవీ షూట్ లో జీవిత జాయిన్ కానున్నారు.

నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన బలగం
శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం లో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీ ధర్, విజయలక్ష్మి, మొగిలి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి భీమ్స్ సంగీతం అందించారు. ఈ మూవీ లో నటించిన నటీ నటులు తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ముంబై హోలీ వేడుకల్లో హీరో నాని
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. దసరా మూవీ ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన హీరో నాని, అక్కడి జుహు ప్రాంతంలో గల ప్రేక్షకాభిమానులతో కలిసి హోలీ వేడుకల్లో సందడి చేశారు.

సోల్ ఆఫ్ రంగమార్తాండ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్నసినిమా రంగమార్తాండ. చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు కృష్ణవంశీ.ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టేశారు. కృష్ణవంశీ అయితే ఎప్పటికప్పుడు ఈసినిమా అప్ డేట్స్ ను ఇస్తూనే ఉన్నాడు. డబ్బింగ్ పనుల దగ్గర నుండి మ్యూజిక్ సెషన్స్ వరకూ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గానే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మానందంకు సంబంధించిన ఒక గ్లింప్స్ ను…

100 రోజుల్లో ఆదిపురుష్ బ్లాస్ట్
అన్నీ కలిసొస్తే ఈ ఏడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండి రెండు సినిమాలు బక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయి. ఆ రెండు సినిమాల్లో ఒకటి ఓం రౌత్ దర్శత్వంలో వస్తున్న ఆది పురుష్ సినిమా. మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ సినిమా. వీటిలో ముందుగా రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా ఆదిపురుష్. హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా భారీ బడ్జెట్ తో ఈసినిమా వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈసినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆడియన్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలన్న నేపథ్యంలో గ్రాఫిక్స్ విషయంలో చిత్రయూనిట్ మరింత శ్రద్ధ…

తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తారో తెలియంది కాదు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ అవ్వగా.. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గణించాడు. ఈసినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.

ఈ నగరానికి ఏమైంది- ధమ్కీ ముందే రీ రిలీజ్
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల కొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. హీరోల పుట్టిన రోజులకు, స్పెషల్ డేస్ కు, సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.. ఇంకొన్ని సినిమాలు రీ రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాకు కూడా రీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ నుండి వస్తున్న సినిమా ధమ్కీ. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

యూ ఎస్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

రానా నాయుడు వెబ్ సిరీస్ లో తన రోల్ గురించి రానా మాటల్లోనే
లోకోమోటివ్ గ్లోబల్ ఇంక్ బ్యానర్ పై కరణ్ అన్షుమన్ దర్శకత్వంలో రానా, వెంకటేష్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ డ్రామా రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ద్వారా మార్చి 10 వ తేదీ స్ట్రీమింగ్ కానుంది.ఈ వెబ్ సిరీస్ లో సుచిత్ర పిళ్ళై , సుర్వీన్ చావ్లా , గౌరవ్ చోప్రా ముఖ్య పాత్రలలో నటించారు. సంగీత్ - సిద్ధార్ధ్ సంగీతం అందించారు.