మరో పాపులర్ అమెరికన్ టాక్ షో కి గెస్ట్ గా రామ్ చరణ్

Ram Charan To Attend Entertainment Tonight Show,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Entertainment Tonight Show,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest News,Ram Charan New Show,Ram Charan Latest Interview,Ram Charan New Interview,Ram Charan Interview,RRR,RRR Movie,RRR For Oscars 2023,RRR Oscars 2023,Ram Charan At Oscars 2023,Ram Charan Entertainment Tonight Show,Ram Charan To Be The First Telugu Actor To Appear On Good Morning America,Good Morning America,Ram Charan On Good Morning America Show,Ram Charan On American TV Show

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది. మార్చి 12, 2023 న ఆస్కార్ అవార్డు వేడుక జరుగనుంది. ఆ అవార్డ్స్ వేడుకలో పాల్గొనడానికి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ యూఎస్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ అక్కడ పలు ఇంటర్వ్యూలు, స్పెషల్ స్క్రీనింగ్స్ కి హాజరయ్యి సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షో లో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా హీరో రామ్ చరణ్ ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్ అనే పాపులర్ అమెరికన్ టాక్ షోకి గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ టాక్ షో కు కూడా గెస్ట్ గా వెళ్లిన మొదటి ఇండియన్ రామ్ చరణ్ కావడం విశేషం. పాపులర్ అమెరికన్ టాక్ షోలకు రామ్ చరణ్ గెస్ట్ గా వెళ్లడంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 13 =