రైటర్ పద్మభూషణ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Writer Padmabhushan Movie OTT Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Writer Padmabhushan,Writer Padmabhushan Movie,Writer Padmabhushan Telugu Movie,Writer Padmabhushan Movie Updates,Writer Padmabhushan Movie Latest News,Writer Padmabhushan OTT,Writer Padmabhushan OTT Release Date,Writer Padmabhushan Movie OTT Release Date,Writer Padmabhushan Movie OTT Release Date Update,Writer Padmabhushan Premieres March 17th,Writer Padmabhushan On March 17th,Writer Padmabhushan On Zee 5,Suhas,Tina Shilparaj,Gouri Priya Reddy,Writer Padmabhushan ZEE5 Date Announcement,Writer Padmabhushan To Stream On Zee5 OTT On March 17th,Writer Padmabhushan On Zee5 OTT On March 17th

షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వీడియోలతో మొదలుపెట్టి తన నటనతో ఆకట్టుకొని ఆ తరువాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి అనంతరం కలర్ ఫోటో సినిమాతో హీరో అయ్యాడు సుహాస్. కలర్ ఫొటో సినిమాకు అవార్డులు సైతం దక్కాయి. ఇక రీసెంట్ రైటర్ పద్మభూషణ్ సినిమాతో మరోసారి తన సత్తాను చూపించాడు. సుహాస్ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమా రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కామెడీ, ఎమోషన్‌, అమ్మ సెంటిమెంట్‌ సినిమాలో బాగా వర్కవుట్‌ అయింది. దీంతో రిలీజయిన మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ తెచ్చుకొని, ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఇక మంచి కలెక్షన్స్ సైతం అందించి నిర్మాతలకు లాభాలను అందించింది

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో మార్చి 17వ తేదీన ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఏంజాయ్ చేయండి.

కాగా షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో టీనా, శ్రీ గౌరీ ప్రియ, రోహిణి, ఆశీష్ విద్యార్థి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రూ మనోహరన్ నిర్మించిన ఈసినిమాకు శేఖర్ చంద్ర, కల్యాణ్ నాయక్ సంగీతం అందించగా.. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫి అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 18 =