తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్

RRR Movie Re Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Full Movie,RRR Telugu Full Movie,RRR Movie Songs,RRR Movie Updates,RRR Movie Re Release,RRR Re Release,RRR Movie Re Release Date,RRR Movie Re Release Update,RRR Oscars 2023,Ram Charan,Jr NTR,SS Rajamouli,RRR Re Release Date,RRR Movie Re Release Date Confirmed,RRR Movie Re Release Date News,RRR Movie Songs,Jr NTR Movies,Ram Charan Movies,RRR Movie Re Release On March 10th

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తారో తెలియంది కాదు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ అవ్వగా.. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గణించాడు. ఈసినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమాను మరోసారి ఇక్కడ రీ రిలీజ్ చేయనున్నారు. ఈసినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే కదా. అవార్డుల వేడుక కోసం ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, చిత్రయూనిట్ ముందు అక్కడికి వెళ్లగా.. ఎన్టీఆర్ రెండు రోజుల క్రితమే వెళ్లాడు. ఈనేపథ్యంలో మరోసారి ఇక్కడ రీ రిలీజ్ చేస్తున్నారు. మార్చి 10వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 10 =