ప్రభాస్ వల్లే ప్రాజెక్ట్ K సాధ్యం

Ashwini Dutt Interesting Comments About Project K,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Project K,Project K Is Happening Only Because Of Prabhas Says Ashwini Dutt,Ashwini Dutt,Ashwini Dutt Interview,Ashwini Dutt Latest Interview,Ashwini Dutt About Project K,Ashwini Dutt About Project K Movie,Ashwini Dutt Comments About Project K,Project K,Project K Movie,Project K Telugu Movie,Project K Movie Updates,Project K Movie Latest News,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest News,Ashwini Dutt Comments On Project K

టాలీవుడ్ స్టార్ హీరో స్థాయి నుండి పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగిన హీరో ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలో. అందులో ఒకటే ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఒకటి. నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాను నాగ్ అశ్విన్ ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడో ఇటీవలే ఈసినిమా కోసం వాడే ఒక టైర్ మేకింగ్ కు సంబంధించి ఒక వీడియో ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఆ చిన్న గ్లింప్స్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా గురించి అప్పుడుప్పుడు అశ్వినిదత్ పలు ఆసక్తికర విషయాలు తెలియచేస్తూనే ఉంటారు. ఇక తాజాగా అశ్వినిదత్ ఈసినిమా గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ వల్లే ప్రాజెక్ట్ కే సినిమా సాధ్యమైందని తెలిపాడు. ప్రభాస్ పర్వతం లాంటి వాడు.. తను ఇండస్ట్రీలోనే టాల్ పర్సన్. ప్రభాస్ లాంటి వాడు ఉన్నాడు కాబట్టే ఇలాంటి సినిమా తీయగలుగుతున్నాం.. దీపికా, అమితాబ్ లాంటి వాళ్లు ఈసినిమాలో జాయిన్ అయ్యారంటే అది ప్రభాస్ వల్లే అని తెలిపాడు.

అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో అమితాబ‌చ్చ‌న్ ఇంకా దిశా పటాని కూడా న‌టిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుక‌గా 2024 జ‌న‌వ‌రి 12న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =