
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 104


వైష్ణవ్ తేజ్ సరసన యంగ్ సెన్సేషన్

అన్నీ మంచి శకునములే కోసం నాని, దుల్కర్

కస్టడీకి షాకింగ్ కలెక్షన్స్

బాబాయ్ మాసీ గ్లింప్స్ చరణ్ రియాక్షన్

కమల్ సినిమాలో స్టార్ హీరో శింబు

ఖుషి- సమంతకు తెలియకుండా విజయ్ క్యూట్ రీల్

నితిన్ మూవీ వేరే లెవల్ లో ఉంటుంది

ప్రభాస్ ఓం రౌత్ క్యూట్ ఫొటో మూమెంట్

హిస్టారిక్ ప్లేస్ లో స్పై టీజర్ రిలీజ్ ప్లాన్

హనుమాన్ పాన్ వరల్డ్ రిలీజ్ అందుకే-ప్రశాంత్ వర్మ

నేను స్టూడెంట్ సార్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

వైష్ణవ్ తేజ్ కోసం మ్యూజిక్ జీనియస్ జీవి ప్రకాష్

హిందీ ఛత్రపతికి షాకింగ్ రన్ టైం

లియో ఫైనల్ షెడ్యూల్ అప్ డేట్

నాగశౌర్య రంగబలి రిలీజ్ డేట్ ఫిక్స్

మహాభారతం 10 భాగాలుగా తీయొచ్చు

మరో సాలిడ్ ప్రాజెక్ట్ లాక్ చేసిన నిఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది కార్తికేయ 2, 18 పేజేస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో కార్తికేయ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక కార్తికేయ 2 సినిమాకు గాను నిఖిల్ సిద్ధార్థకు పాపులర్ ఛాయిస్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. ప్రస్తుతం నిఖిల్ గారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఈసినిమా స్పై. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమా జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

బోయపాటి రామ్ మూవీ అప్డేట్
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను,ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ప్రస్తుతం ఈసినిమా చివరి దశ షూటింగ్ లో వుంది.ఇక ఈసినిమా నుండి రామ్ బర్త్ డే సందర్భంగా మే 15న ఉదయం 11:25గంటలకు ఫస్ట్ థండర్ అనే పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నామని మేకర్స్ తెలియజేశారు.ఈ సందర్భంగా ఈసినిమాలోని రామ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

వైష్ణవ్ తేజ్ సరసన యంగ్ సెన్సేషన్
మెగాహీరో ట్యాగ్ తో సాయిధరమ్ తేజ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా మెగా హీరోలకు సైతం పోటీ ఇచ్చేలా ఉన్నాడన్న అభిప్రాయాలను సొంతం చేసుకున్నాడు. ఉప్పెన తరువాత కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమాలు చేయగా రెండు సినిమాలు కూడా డీసెంట్ హిట్ నే అందించాయి. ఇక ఇప్పుడు తన నాలుగో సినిమాతో వస్తున్నాడు. VT04 అనే వర్కింగ్ టైటిల్ తోనే చిత్రీకరణ జరుపుకుంటున్న ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.

అన్నీ మంచి శకునములే కోసం నాని, దుల్కర్
గోల్కొండ హై స్కూల్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంతోష్ శోభన్ తను మను సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేస్తూ హీరోగా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో అన్నీ మంచి శకునములే అనే టైటిల్ తో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు మేకర్స్.

కస్టడీకి షాకింగ్ కలెక్షన్స్
నాగ చైతన్య నటించిన కస్టడీ నిన్న థియేటర్లోకి రాగ పాజిటివ్ మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది.మొదటి రోజు ఈసినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా 7.4కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా ఇందులో షేర్ 3.9కోట్లు.ఈరోజు,మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టే అవకాశాలు కూడా లేకపోలేదు.ఇక అటు యూఎస్ఏ లో ఈసినిమా ఇప్పటివరకు 200k డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.

బాబాయ్ మాసీ గ్లింప్స్ చరణ్ రియాక్షన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. కేవలం చిన్న గ్లింప్స్ తో రాంపేజ్ ఆడిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఇన్ని రోజులు తను వెయిట్ చేసిన దానికి ఫలితంగా ఈసినిమాను అంతే కసిగా హరీష్ శంకర్ తీస్తున్నట్టు రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అర్థమైంది. పవన్ ఫ్యాన్స్ కు ఈ గ్లింప్స్ తో ఫుల్ మీల్స్ అందించాడు హరీష్. పవన్ కళ్యాణ్ పక్కా మాస్ పోలీస్ ఆఫీసర్‌గా…

కమల్ సినిమాలో స్టార్ హీరో శింబు
విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న కమల్ ఇప్పుడు పలు కొత్త సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ఈసినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. ఇదిలా ఉండగా మణిరత్నంతో కూడా కమల్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

స్పెషల్ సాంగ్ కు నో అంటున్న కృతి శెట్టి
ఉప్పెన తో హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి.ఈసినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆఫర్లు క్యూ కట్టాయి.ఉప్పెన తరువాత కృతి..శ్యామ్ సింగ రాయ్,బంగార్రాజు,వారియర్,మాచర్ల నియోజకవర్గం,ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి,కస్టడీ సినిమాల్లో నటించింది.ఇందులో కస్టడీ ఈరోజే విడుదలైంది.ఈసినిమాతో కృతి, తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.ఇక ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.పుష్ప లో సమంత స్పెషల్ సాంగ్ చేసింది కదా అలా ఏమైనా మీకు స్పెషల్ సాంగ్ ఆఫర్ వస్తే చేస్తారా అని అడిగిన ప్రశ్నకు కృతి రెస్పాండ్ అయ్యింది.

ఖుషి- సమంతకు తెలియకుండా విజయ్ క్యూట్ రీల్
శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి నా రోజా నువ్వే అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఇక ఈపాట సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని శ్రోతలను ఆకట్టుకుంటుంది. సాంగ్ మ్యూజిక్, లిరిక్స్ తో పాటు విజువల్స్, సమంత అండ్ విజయ్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు…

నితిన్ మూవీ వేరే లెవల్ లో ఉంటుంది
తమ అభిమాన హీరోల సినిమాల గురించి ఫ్యాన్స్ డైెరెక్టర్ లనే డైరెక్ట్ గా సోషల్ మీడియా ద్వారా అడిగేస్తుంటారు. కొంతమంది అయితే వారికి రిప్లైలు కూడా ఇస్తుంటారు. ఇక ఇప్పుడు వెంకీ కుడుములకు కూడా అలాంటి ప్రశ్నే ఎదురైంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లు గా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. వెంకీ కుడుముల, నితన్, రష్మిక కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఈసినిమాపై కూడా ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి.

ప్రభాస్ ఓం రౌత్ క్యూట్ ఫొటో మూమెంట్
ప్రస్తుతం ఉన్న మోస్ట అవైటెడ్ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు అలానే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

హిస్టారిక్ ప్లేస్ లో స్పై టీజర్ రిలీజ్ ప్లాన్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ2, 18 పేజెస్ హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కు సిద్దమవుతున్నాడు. గారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ స్పై సినిమా వస్తుంది. సుభాష్ చంద్రబోస్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ను బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను ముంగిచుకునే పనిలో ఉంది.

హనుమాన్ పాన్ వరల్డ్ రిలీజ్ అందుకే-ప్రశాంత్ వర్మ
డిఫరెంట్ కథతో విభిన్నమైన కాన్సెప్ట్ లతో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో వచ్చేస్తున్నాడు. తేజసజ్జా హీరోగా న దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే బాంబిరెడ్డి అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈసినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగాయి. అందులోనూ ఈసినిమా సూపర్ హీరోస్ నేపథ్యంలో వస్తుండటంతో ఎక్స్ పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. దానికి తోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ తో అంచనాలు నెక్ట్స్ లెవల్ వెళ్లాయి.

నేను స్టూడెంట్ సార్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
స్వాతిముత్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు బెల్లంకొండ గణేష్. మంచి కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చి తన డీసెంట్ యాక్టింగ్ తో మంచి మార్కులే కొట్టేశాడు గణేష్. ఇక ఇప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాకీ ఉప్పలపాటీ దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సార్. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి టీజర్ కూడా రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచింది.

వైష్ణవ్ తేజ్ కోసం మ్యూజిక్ జీనియస్ జీవి ప్రకాష్
మెగా కాంపౌండ్ నుండి వచ్చి మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన, కొండపొలం సినిమాల తరువాత వైష్ణవ్ తేజ్ రీసెంట్ గానే లవర్ బాయ్ పాత్రలో రంగ రంగ వైభవంగా సినిమాతో వచ్చాడు. ఇక ఇప్పుడు తన నాలుగో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా వస్తుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ మాస్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం అయితే చివరిదశలో ఉంది.

హిందీ ఛత్రపతికి షాకింగ్ రన్ టైం
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్,ఛత్రపతితో హిందీలోకి అడుగుపెడుతున్నాడు.రేపే ఈసినిమా థియేటర్లలోకి రానుంది.తెలుగు బ్లాక్ బాస్టర్ మూవీ ఛత్రపతిని అదే టైటిల్ తో హిందీలో రీమేక్ చేశారు.తెలుగులో స్టార్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న వివి వినాయక్ ఈరీమేక్ ను ను డైరెక్ట్ చేశాడు.ఇటీవల రిలీజ్ అయిన ఈసినిమా ట్రైలర్ యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా ఒరిజినల్ వెర్షన్ కంటే తక్కువ రన్ టైం తో రానుంది.కేవలం 2గంటల 3నిమిషాల రన్ టైం తోనే ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఇంతకుముందు సాయి శ్రీనివాస్ నటించిన సినిమాలు హిందీలో యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ రెస్పాన్స్ ను…

లియో ఫైనల్ షెడ్యూల్ అప్ డేట్
తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. లియో అనే టైటిల్ తో వస్తున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను కూడా ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా షూటింగ్ ను పూర్తి చేసున్నారు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చెన్నైలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో విజయ్, అర్జున్ ఇంకా ఇతర ప్రధాన పాత్రల కాంబినేషన్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. అనంతరం చివరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ…

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ రిలీజ్ : ఈ సారి బద్దలైపోద్ది
ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా వుండబోతుందో డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక చిన్న గ్లింప్స్ తో చెప్పేసాడు.కొద్దీ సేపటి క్రితం మేకర్స్ ఈసినిమానుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.42 సెకండ్ల రన్ టైంతో వచ్చిన ఈవీడియో ఫుల్ మాస్ గా వుంది.హరీష్ మార్క్ డైలాగ్స్,పవన్ కళ్యాణ్ లుక్,మ్యానరిజం,దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈవీడియో లో హైలైట్ అయ్యాయి.భగవద్గీతలోని శ్లోక సారాంశంతో గ్లింప్స్ మొదలవ్వగా ఆతరువాత భగత్ సింగ్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు పవన్ కళ్యాణ్.. ఓవరాల్ గా గ్లింప్స్ చూస్తుంటే ఉస్తాద్ భగత్ సింగ్,గబ్బర్ సింగ్ ను మించి ఉండేలాగే వుంది.ఇక ఇంతకుముందు పవన్,హరీష్ కాంబినేషన్ లో వచ్చిన…

నాగశౌర్య రంగబలి రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా మూవీ లవర్స్ కు మంచి సినిమా అందించేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీగా ఉంటాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

మహాభారతం 10 భాగాలుగా తీయొచ్చు
దర్శకధీరుడు రాజమౌళి నుండి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ తోో తన రేంజ్ మరింత పెరిగింది. దీంతో రాబోయే సినిమాలు ఇంకాస్త జాగ్రత్తగా కొత్తగా తీయాల్సిందే. ప్రస్తుతం అయితే తను మహేష్ బాబు సినిమా కోసం సిద్దమవుతున్నాడు. ఈసినిమా అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రాబోతుంది. ప్రస్తుతం అయితే రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. భారీ స్థాయిలో ఈసినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.