తమ అభిమాన హీరోల సినిమాల గురించి ఫ్యాన్స్ డైెరెక్టర్ లనే డైరెక్ట్ గా సోషల్ మీడియా ద్వారా అడిగేస్తుంటారు. కొంతమంది అయితే వారికి రిప్లైలు కూడా ఇస్తుంటారు. ఇక ఇప్పుడు వెంకీ కుడుములకు కూడా అలాంటి ప్రశ్నే ఎదురైంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లు గా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. వెంకీ కుడుముల, నితన్, రష్మిక కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఈసినిమాపై కూడా ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఓ నితిన్ అభిమాని ట్విట్టర్ ద్వారా అన్నా మన యాక్టర్ నితిన్ అన్నది కూడా ఈసారి వేరే లెవల్ లో ఉండాలి.. మాట ఇచ్చావ్ గుర్తుపెట్టుకో అన్నయ్య కొంచం లవ్ యూ అంటూ వెంకీని ట్యాగ్ చేశాడు. ఇక దీనికి వెంకీి కూడా రిప్లై ఇస్తూ..నో డౌట్ వేరే లెవల్ లో ఉంటుంది.. ఈ మెసేజ్ నువ్వు కూడా గుర్తుపెట్టుకో బ్రదర్ అంటూ సమాధానం ఇచ్చాడు.
No doubtttt.. Vere level lo untadhi..
Ee msg Nuv kuda gurthupettuko brother.. 🤗👍 https://t.co/3JAeFkQeLQ— Venky Kudumula (@VenkyKudumula) May 11, 2023
కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. మరి భీష్మ చిత్రంతో ఈ ముగ్గురు కలసి మ్యాజిక్ చేశారు.. ఈసారి అదే మ్యాజిక్ చూపిస్తారా లేదా అన్నది చూడాలి
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: