దర్శకధీరుడు రాజమౌళి నుండి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ తోో తన రేంజ్ మరింత పెరిగింది. దీంతో రాబోయే సినిమాలు ఇంకాస్త జాగ్రత్తగా కొత్తగా తీయాల్సిందే. ప్రస్తుతం అయితే తను మహేష్ బాబు సినిమా కోసం సిద్దమవుతున్నాడు. ఈసినిమా అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రాబోతుంది. ప్రస్తుతం అయితే రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. భారీ స్థాయిలో ఈసినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అన్న సంగతి తెలిసిందే కదా. దాన్ని ఎప్పటికైనా సినిమాగా తీయాలని రాజమౌళి గతంలో చాలా సార్లు చెప్పిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి మహాభారతంపై మాట్లాడుతూ పలు ఆసక్తిర విషయాలు తెలియచేశారు. మహాభారతం టెలివిజన్ లో తీయడానికి 250పైగా ఎపిసోడ్స్ పట్టాయి.. మీరు ఎన్ని భాగాలుగా తీస్తారు అని అడుగగా దానికి రాజమౌళి అది చాలా కష్టమైన పని నాకు కూడా తెలుసు.
నిజానికి ముందు నేను మహాభారతం తీయాలంటే అది చదవడానికే నాకు ఒక ఏడాది టైమ్ పడుతుంది.
మహాభారతం తీయాలనుకుంటే ముందు భారతదేశంలో అందుబాటులో ఉన్న అన్ని మహాభారత వర్షన్లు చదవాలి. ఒకవేళ మహాభారతం తీస్తే దాదాపు 10 భాగాలుగా తీయొచ్చు అనుకుంటున్నాను అని తెలిపారు. మరి రాజమౌళి ఒక సినిమా తీయడానికి చాలా టైమ్ తీసుకుంటాడు. అలాంటిది మహాభారతం 10 భాగాలు అంటే ఇంకేంత టైమ్ పడుతుందో ఊహించుకోవచ్చు. మరి మహేష్ తరువాత మరే సినిమా లేదు కాబట్టి అనంతరం ఏమైనా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెడతాడేమో చూడాలి..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























