కమల్ సినిమాలో స్టార్ హీరో శింబు

tamil star hero simbu to join in kamal hassan and mani ratnam movie

విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న కమల్ ఇప్పుడు పలు కొత్త సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ఈసినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. ఇదిలా ఉండగా మణిరత్నంతో కూడా కమల్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమాలో నటించే హీరోయిన్ పై వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో మరో స్టార్ హీరో భాగమవుతున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు శింబు. శింబు ఈసినిమాలో ఓకీలకపాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కమల్ తన బ్యానర్ లో శింబు సినిమాను నిర్మిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే కమల్ సినిమాలో శింబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేతవరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా కమల్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో 1987లో నాయగన్ సినిమా వచ్చింది. ఆసినిమా సంచలన విజయం దక్కించుకుంది. ఇక ఇన్నేళ్ల తరువాత మరోసారి కలిసి పనిచేయనున్నారు. మరి ఈసినిమా వీరికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.