వైష్ణవ్ తేజ్ కోసం మ్యూజిక్ జీనియస్ జీవి ప్రకాష్

g v prakash on board for vaishnav tej 4th movie

మెగా కాంపౌండ్ నుండి వచ్చి మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన, కొండపొలం సినిమాల తరువాత వైష్ణవ్ తేజ్ రీసెంట్ గానే లవర్ బాయ్ పాత్రలో రంగ రంగ వైభవంగా సినిమాతో వచ్చాడు. ఇక ఇప్పుడు తన నాలుగో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా వస్తుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ మాస్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం అయితే చివరిదశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు సంబంధించి పలు అప్ డేట్లతో వస్తున్నారు చిత్రయూనిట్. ఈసినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇప్పటికే ఇచ్చారు. ఈసినిమాలో అపర్ణా దాస్‌ హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రకాశన్‌, మనోహరం, బీస్ట్‌ వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అపర్ణా దాస్. ఇప్పుడు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ ను కన్ఫామ్ చేశారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో వచ్చిన సార్ సినిమాకు హిట్ ఆల్బమ్ అందించిన జీవి ప్రకాష్ ను మరోసారి ఈసినిమా కోసం తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈసినిమాలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రం టైటిల్, అలాగే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =