శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి నా రోజా నువ్వే అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఇక ఈపాట సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని శ్రోతలను ఆకట్టుకుంటుంది. సాంగ్ మ్యూజిక్, లిరిక్స్ తో పాటు విజువల్స్, సమంత అండ్ విజయ్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ ని ఇచ్చింది. ప్రస్తుతం అయితే ఈపాట సోషల్ మీడియాలో వ్యూస్ తో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో క్యూట్ రీల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఇన్ స్టా రీల్ ను స్వయంగా హీరో విజయ్ దేవరకొండ తీయడం విశేష . అది కూడా సమంతకు తెలియకుండా నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే పాట పాడుతూ తీసిన ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. రోజా హెయిర్ స్టైల్ చేసుకుంటున్నప్పుడు.. తను వేరే వాళ్లతో మాట్లాడున్నప్పుడు తనకు తెలియకుండా తీసిన ఈ క్యూట్ వీడియో మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది.
View this post on Instagram
ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)