నేను స్టూడెంట్ సార్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

bellamkonda ganesh nenu student sir movie new release date announced

స్వాతిముత్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు బెల్లంకొండ గణేష్. మంచి కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చి తన డీసెంట్ యాక్టింగ్ తో మంచి మార్కులే కొట్టేశాడు గణేష్. ఇక ఇప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాకీ ఉప్ప‌ల‌పాటీ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ గణేష్హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సార్. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి టీజర్ కూడా రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను ముందు మార్చి 10వ తేదీన రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడంతోో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను జూన్ 2వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈసినిమాలో అవంతిక దస్సాని ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా సముద్రఖని, సునీల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు నటిస్తున్నారు. ఈసినిమాను నాంది వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని రూపొందించిన ఎస్‌వీ2 ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మధాడి.. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 15 =