టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్,ఛత్రపతితో హిందీలోకి అడుగుపెడుతున్నాడు.రేపే ఈసినిమా థియేటర్లలోకి రానుంది.తెలుగు బ్లాక్ బాస్టర్ మూవీ ఛత్రపతిని అదే టైటిల్ తో హిందీలో రీమేక్ చేశారు.తెలుగులో స్టార్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న వివి వినాయక్ ఈరీమేక్ ను ను డైరెక్ట్ చేశాడు.ఇటీవల రిలీజ్ అయిన ఈసినిమా ట్రైలర్ యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా ఒరిజినల్ వెర్షన్ కంటే తక్కువ రన్ టైం తో రానుంది.కేవలం 2గంటల 3నిమిషాల రన్ టైం తోనే ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఇంతకుముందు సాయి శ్రీనివాస్ నటించిన సినిమాలు హిందీలో యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి.ఆకాన్ఫిడెన్స్ తో శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.మరి ఈసినిమాను హిందీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నుశరత్ బరూచా హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో శరద్ కెల్కర్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తనిష్క్ బాఘ్చి సంగీతం అందించాడు.పెన్ స్టూడియోస్ నిర్మించింది.ఇదిలావుంటే తెలుగులో ఛత్రపతి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.టాప్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా శ్రీయా హీరోయిన్ గా నటించింది.ఈసినిమాతో ప్రభాస్ మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: