మెగాహీరో ట్యాగ్ తో సాయిధరమ్ తేజ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా మెగా హీరోలకు సైతం పోటీ ఇచ్చేలా ఉన్నాడన్న అభిప్రాయాలను సొంతం చేసుకున్నాడు. ఉప్పెన తరువాత కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమాలు చేయగా రెండు సినిమాలు కూడా డీసెంట్ హిట్ నే అందించాయి. ఇక ఇప్పుడు తన నాలుగో సినిమాతో వస్తున్నాడు. VT04 అనే వర్కింగ్ టైటిల్ తోనే చిత్రీకరణ జరుపుకుంటున్న ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమాలో కాస్టింగ్ కు సంబంధించిన వివరాలు తెలియచేస్తున్నారు. ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేస్తూ తన పాత్రను రివీల్ చేశారు. శ్రీలీల ఈసినిమాలో చిత్ర అనే పాత్రలో నటిస్తుంది.
Say Hello to Chitra… ! #PVT04
Glimpse Out Soon! 🤩#PanjaVaisshnavTej #JojuGeorge @aparnaDasss @gvprakash #SrikanthNReddy @NavinNooli @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/a3Z6zJbZ8w— sreeleela (@sreeleela14) May 13, 2023
కాగా ఈసినిమాలో అపర్ణా దాస్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించారు. ప్రకాశన్, మనోహరం, బీస్ట్ వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అపర్ణా దాస్. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: