
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 10


90 రోజుల న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న కన్నప్ప

'బబుల్‌గమ్' అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై దిల్ రాజ్ క్రేజీ అప్ డేట్

ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేసిన సలార్

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బబుల్ గమ్

సలార్ టీమ్‌కి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు

మహారాష్ట్ర సీఎంతో చెర్రీ దంపతులు

డంకి ఫస్ట్ డే కలెక్షన్స్

శౌర్యాంగ పర్వం గా సలార్ పార్ట్ 2

సలార్ లో ఛాన్స్ పై జగ్గూభాయ్ క్లారిటీ

సలార్ హిందీ కలెక్షన్స్
సలార్ తొలి రోజు హిందీలో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.షారుక్ ఖాన్ డంకితో పోటీ వల్ల తక్కువ థియేటర్లలో విడుదలై కూడా మొదటి రోజు 15కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈరోజు మొదటి రోజు కన్నా ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టుకోనుంది.బాహుబలితో హిందీలోనూ ప్రభాస్ కి మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది.సాహోతో ఆ మార్కెట్ మరింతగా పెరిగింది. ఇక ఇప్పుడు సలార్ తో మరో సారి సత్తాచాటుతున్నాడు.మరి ఫుల్ రన్ లో సలార్ హిందీ లో ఎంత కలెక్ట్ చేస్తుందోచూడాలి.

90 రోజుల న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న కన్నప్ప
టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తుండగా.. దేశంలోని స్టార్ కాస్టింగ్ భాగం నటిస్తోంది. దీనిలో భాగంగా మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్‌కుమార్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇంకా విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సైతం మరో కీ రోల్‌ను పోషిస్తున్నారు.

'బబుల్‌గమ్' అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్
ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్‌గమ్'. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు రవికాంత్ పేరేపు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

సలార్ ర్యాంపేజ్- బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రభాస్ కు సాలిడ్ కథ పడితే ఎలా ఉంటుందో ఈసినిమా రుజువు చేసింది. చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు అయితే ఫుల్ మీల్స్ అందించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ యాక్టింగ్, మాస్ అవతార్, యాక్షన్ సీక్వెన్స్, ప్రశాంత్ నీల్ మేకింగ్ అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి.

బాక్సాఫీస్ వద్ద సలార్ విధ్వంసం.. ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్
యంగ్ రెబెల్ స్టార్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'సలార్'. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీకి 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో తొలిభాగం 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' శుక్రవారం (డిసెంబర్ 22, 2023) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ క్రమంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బెనిఫిట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి మళ్ళీ ఆ స్థాయి హిట్ సినిమా రాలేదని ఆయన ఫ్యాన్స్ గత కొన్నేళ్లుగా…

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై దిల్ రాజ్ క్రేజీ అప్ డేట్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మెసేజ్ ఒరియెంటెడ్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమాలో రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.

సర్కారు నౌకరి- పంట చేతికి వచ్చేయాలా సాంగ్ రిలీజ్
సినీ ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. అయితే వారి సక్సెస్ అనేది మాత్రం తమ టాలెంట్ పై, హార్డ్ వర్క్ పై ఆధారపడి ఉంటుంది. టాలెంట్ ఉంటే మాత్రం మన ప్రేక్షకులు తప్పకుండా ఆధారిస్తారు. ఇక ఇప్పుడు మరో వారసుడు టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేస్తున్నాడు. అతను ఎవరో కాదు టాలీవుడ్ టాప్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేసిన సలార్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ మౌత్ టాక్ తెచ్చుకోవడంతో మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా 178.7కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సలార్ అదరగొట్టింది.కేరళలో అయితే తొలి రోజు 4.60కోట్ల గ్రాస్ తో ఆర్ఆర్ఆర్ రికార్డు ను బ్రేక్ చేసి అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన రెండో తెలుగు సినిమా గా రికార్డు సృష్టించింది.ఈజాబితాలో 5.40కోట్లతో బాహుబలి 2 మొదటి స్థానం లో వుంది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన చంద్రబోస్ డాక్యుమెంటరీ
గతకొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభ దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయంగా కూడా వెలుగొందుతోంది. ముఖ్యంగా దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ ఆర్' సినిమా అనేక సంచలనాలు సృష్టించింది. ఇందులో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా ఈ సినిమాకి పనిచేసిన పలువురు టెక్నీషియన్స్ కూడా గ్లోబల్ వైడ్ గా గుర్తింపు పొందారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో.. ఈ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు గానూ ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో కలిసి చంద్రబోస్ ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలో తాజాగా మరో తెలుగు డాక్యుమెంటరీ…

జూ.ఎన్టీఆర్‌కు అరుదైన గుర్తింపు.. టాలీవుడ్ నుంచి తొలి హీరోగా
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో దేశవ్యాప్తంగానే కాక గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు సాధించారు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. అచిరకాలంలోనే స్టార్ హీరో స్టేటస్ సొంతం చేసుకున్నారు. డ్యాన్స్‌లు, పాటలు పాడటం, అలవోకగా డైలాగ్స్ చెప్పడం వంటి మల్టీ ట్యాలెంటెడ్ నటనతో నాలుగు పదుల వయస్సుకే ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలో సినిమాల పరంగా ఎన్నో రికార్డులు అందుకున్నారు జూ. ఎన్టీఆర్. అలాగే మరికొన్ని అరుదైన ఘనతలను కూడా సొంతం చేసుకున్నారు. ఇటీవలే ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో ప్లేస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాగే పలు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్…

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బబుల్ గమ్
బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా బబుల్ గమ్ సినిమా వస్తుంది.ఈసినిమా 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ కూడా ఫిక్స్ చేశారు. డిసెంబర్ 24వ తేదీన రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 6 గంటల నుండి కార్యక్రమం జరగనుంది. ఇక ఈ యంగ్ హీరోలు అడివి శేష్, విశ్వక్…

బబుల్ గమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్- అతిథులుగా యంగ్ హీరోలు
నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమల తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో బబుల్ గమ్ సినిమాతో రోషన్ హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. ఈసినిమాకు మాత్రం మంచి పాజిటివ్ బజ్ యే వస్తుంది. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో పాటు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈసినిమా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మేకర్స్.

సలార్ టీమ్‌కి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ 'సలార్'. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఈ క్రమంలో తొలిభాగం 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బెనిఫిట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో డార్లింగ్ అభిమానుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వచ్చారంటే…

మహారాష్ట్ర సీఎంతో చెర్రీ దంపతులు
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు.

డంకి ఫస్ట్ డే కలెక్షన్స్
త్రీ ఇడియట్స్ ఫేమ్ రాజ్ కుమార్ హిరానీ ,బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా డంకి.నిన్న విడుదలైన ఈసినిమా డీసెంట్ రివ్యూస్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 60కోట్ల గ్రాస్ ను రాబట్టింది.విక్కీ కౌశల్ ,తాప్సి పన్ను,బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించిన ఈచిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించగా జియో స్టూడియోస్,రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్,రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్ నిర్మించాయి.

యానిమల్ అన్ స్టాపబుల్ 3వ వారం కలెక్షన్స్
సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఈసినిమాను సందీప్ తీసిన విధానం అలానే ఇక ఈ రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఓటిటిలోకి ఆదికేశవ
ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్,సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల జంటగా నటించిన చిత్రం ఆదికేశవ.గత నెలలో విడుదలైన ఈసినిమాను కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా ఓటిటి లోకి వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.తెలుగు తోపాటు తమిళ ,మలయాళ,కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో వైష్ణవ్ డిఫ్రెంట్ గా కనిపించాడు.తన కెరీర్ లో మొదటి సారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించాడు.

హనుమాన్ టీమ్ కు సినిమాటోగ్రఫి మినిస్టర్ బెస్ట్ విషెస్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఫాంటసీ సినిమాగా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో ఇప్పటికే జాంబిరెడ్డి సినిమా వచ్చి హిట్ అవ్వడంతో ఈసినిమాపై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచేశాయి.

శౌర్యాంగ పర్వం గా సలార్ పార్ట్ 2
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఫైనల్ నేడు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

సలార్ లో ఛాన్స్ పై జగ్గూభాయ్ క్లారిటీ
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇక ప్రభాస్ ను ఎలా చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారా వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రభాస్ ను అదే రేంజ్ మాస్ అవతార్ లో చూపించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ మాస్ యాక్షన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రభాస్ ను ఇలా చూడాలని ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న వారికి సలార్ ఫుల్ మీల్స్ ను అందించింది. ప్రస్తుతం ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని దూసుకెళ్తుంది.