రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ మౌత్ టాక్ తెచ్చుకోవడంతో మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా 178.7కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సలార్ అదరగొట్టింది.కేరళలో అయితే తొలి రోజు 4.60కోట్ల గ్రాస్ తో ఆర్ఆర్ఆర్ రికార్డు ను బ్రేక్ చేసి అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన రెండో తెలుగు సినిమా గా రికార్డు సృష్టించింది.ఈజాబితాలో 5.40కోట్లతో బాహుబలి 2 మొదటి స్థానం లో వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు రేపు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా ఉండడంతో వీకెండ్ లో సలార్ 400కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం.మరోవైపు ఈసినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.చాలా రోజుల నుంచి తమ అభిమాన హీరోను తెర మీద ఎలా చూడాలనుకున్నారో ఆ కోరికను సలార్ తీర్చింది.
కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించగా రవి బస్రుర్ సంగీతం అందించాడు.హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించింది.ఇక ఈసినిమాకు సీక్వెల్ గా రెండో పార్ట్ కూడా తెరకెక్కనుంది.శౌర్యంగా పర్వం పేరుతో సెకండ్ పార్ట్ రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: