90 రోజుల న్యూజిలాండ్‌ షెడ్యూల్ పూర్తిచేసుకున్న కన్నప్ప

Kannappa Completed 90 Days Schedule of New Zealand

టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్‌ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్‌’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌ పోషిస్తుండగా.. దేశంలోని స్టార్ కాస్టింగ్ భాగం నటిస్తోంది. దీనిలో భాగంగా మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్‌కుమార్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇంకా విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సైతం మరో కీ రోల్‌ను పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి ఓ స్టార్ యాక్టర్ ‘కన్నప్ప’లో నటించనుండటంతో ఈ సినిమా నేషనల్ వైడ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ న్యూజిలాండ్‌లో మూడు నెలల క్రితం మొదలవగా.. తాజాగా 90 రోజుల ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకున్నట్లు కన్నప్ప టీమ్ ప్రకటించింది. అలాగే ఈ షెడ్యూల్‌లో న్యూజిలాండ్, థాయ్‌లాండ్ మరియు భారతదేశానికి చెందిన మొత్తం 600 మంది ప్రతిభావంతులైన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల బృందం పాల్గొన్నారని కూడా వెల్లడించింది.

కాగా విష్ణు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా నవంబర్ 23న కన్నప్ప ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయగా.. అందులోని విష్ణు లుక్‌ మూవీ లవర్స్ ని ఆకట్టుకుంది. ఇందులో విష్ణు ‘క‌న్న‌ప్ప’గా అద్భుతమైన లుక్‌లో కనిపించారు. ఓ వైపు నుంచి బాణాలు త‌న పైకి దూసుకు వ‌స్తుండగా.. విష్ణు ఆకాశంలోకి చూస్తు విల్లును ఎక్కుపెట్టి బాణాలు వేస్తున్న‌ట్లుగా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే.. ‘కన్నప్ప’ను ఓ రేంజ్‌లో తెర‌కెక్కిస్తున్న‌ట్లు ఆర్థ‌మ‌వుతోంది. కాగా ఈ ఫ‌స్ట్ లుక్‌ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక  ‘కన్నప్ప’ చిత్రాన్ని ‘అవా ఎంటర్టైన్మెంట్‌’ మరియు ’24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ’ పతాకంపై మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు.

ఒకప్పటి టాలీవుడ్ క్లాసిక్ అయిన భక్త కన్నప్పకు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా స్క్రిప్ట్‌కు సీనియర్‌ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌, నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి తదితరులు తుది మెరుగులు దిద్దగా.. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. అలాగే.. ‘బాహుబలి’, ‘జవాన్’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి భారీ ప్రాజెక్టు‌లకు ఫైట్స్ కంపోజ్ చేసిన హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెచా ఈ సినిమాలో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే యేడాది పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భాషలలో గ్రాండ్‍గా రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.