సలార్ ర్యాంపేజ్- బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్

prabhas salaar movie first day worldwide collections

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రభాస్ కు సాలిడ్ కథ పడితే ఎలా ఉంటుందో ఈసినిమా రుజువు చేసింది. చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు అయితే ఫుల్ మీల్స్ అందించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ యాక్టింగ్, మాస్ అవతార్, యాక్షన్ సీక్వెన్స్, ప్రశాంత్ నీల్ మేకింగ్ అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అడ్వాన్స్ సేల్స్ లోనే రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.178.7 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ముందు షారుఖ్.. రూ.57 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను సాధించింది. ‘జవాన్’ రూ.75 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను సాధించింది. రీసెంట్ గా వచ్చిన ‘యానిమల్’ ఓపెనింగ్ డే కలెక్షన్స్ రూ.63 కోట్లు. ఇప్పుడు ‘సలార్’ ఏకంగా రూ.95 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్‌ను సాధించింది. దీంతో ఈ ఏడాదిలో మొదటిరోజు బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ ఇచ్చిన చిత్రంగా సలార్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

కాగా సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. పృథ్విరాజ్ సుకుమారన్‌, జగపతిబాబు, బాబి సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్‌, సప్తగిరి, సిమ్రత్‌ కౌర్‌, పృథ్విరాజ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. . హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించగా.. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.