ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మెసేజ్ ఒరియెంటెడ్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమాలో రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది రిలీజ్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేశారు.. కానీ ఈ ఏడాది మిస్ అయిపోయింది. మరోవైపు ఇంతవరకూ రిలీజ్ డేట్ పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ తో సినీ లవర్స్ అందరూ రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈసినిమా రిలీజ్ పై సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు ఈసినిమా నిర్మాత అయిన దిల్ రాజు. ఈసినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఉంటుందని తెలియచేశారు. దీంతో ఇప్పుడు ఈవార్త వైరల్ గా మారింది. మరి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: