బాక్సాఫీస్ వద్ద సలార్‌ విధ్వంసం.. ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్

Salaar Box Office Day 1 Collections Prabhas' Movie Creates New Record

యంగ్ రెబెల్ స్టార్ స్టార్‌ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సలార్’. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీకి ‘కేజీఎఫ్‌’ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో తొలిభాగం ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ శుక్రవారం (డిసెంబర్ 22, 2023) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ క్రమంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బెనిఫిట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్‌ నుంచి మళ్ళీ ఆ స్థాయి హిట్ సినిమా రాలేదని ఆయన ఫ్యాన్స్ గత కొన్నేళ్లుగా మధనపడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో సలార్‌ సినిమా బావుందని, ముఖ్యంగా ఇందులో ప్రభాస్ ఎలివేషన్ సీన్స్ అద్దిరిపోయాయని, అందునా యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు. దీంతో డార్లింగ్‌ అభిమానుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో సలార్‌ చిత్రం బాక్సాఫీస్ వద్ద విధ్వంసమే సృష్టించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 178.7 కోట్లు కలెక్షన్స్ సాధించింది. అందులో ఇండియావైడ్‌గా రూ.135 కోట్లు.. ఓవర్సీస్ నుంచి మరో రూ.43.7 కోట్లు వచ్చాయి. ఈ క్రమంలో ఒక్క ఇండియాలోనే రూ. 95 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. ప్రభాస్ స్టామినాకు ఈ కళ్ళు చెదిరే వసూళ్లే ఉదాహరణ అని డార్లింగ్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.

ఇక తొలిరోజు కలెక్షన్ల పరంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవడం నాలుగోసారి కావడం విశేషం. తద్వారా దేశంలో ఈ రికార్డ్ అందుకున్న ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచాడు. ఇంతకుముందు ఆయన మూడుసార్లు ఈ ఫీట్ సాధించాడు. తొలిసారి ‘బాహుబలి 2’, అనంతరం ‘సాహో’ సినిమా, ఆ తర్వాత ‘ఆదిపురుష్’ సినిమాలు ఫస్ట్ డే రూ.100 కోట్ల గ్రాస్ సాధించాయి. కాగా సలార్‌లో శృతి హాసన్ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించగా.. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ ‘వరదరాజ మన్నార్’ అనే కీలక పాత్ర పోషించారు. అలాగే టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్‌, సప్తగిరి, సిమ్రత్‌ కౌర్‌, పృథ్విరాజ్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 1 =